NTV Telugu Site icon

వైర‌ల్‌: ఇలాంటి యాక్సిడెంట్‌ను ఎప్పుడూ చూసుండ‌రు…!!

యాక్సిడెంట్ అనే పేరు వింటేనే గ‌జ‌గ‌జ‌వ‌ణికిపోతాం.  వాహ‌నాలు న‌డిపే స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకొని న‌డుపుతుంటాం.   ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఒక్కోసారి ప్ర‌మాదాలు జ‌రుతూనే ఉంటాయి.  అయితే, కొన్ని ప్ర‌మాదాలు చాలా విచిత్రంగా జ‌రుగుతంటాయి.  ప్ర‌మాదంతో సంబంధంలేని వ్య‌క్తులు వాహనాలు కూడా ప్ర‌మాదాల‌కు గురిఅవుతుంటాయి.  అలాంటి వాటిల్లో ఇదికూడా ఒక‌టి.  

Read: తాజా స‌ర్వే: ఆ రాష్ట్రంలోనే మ‌హిళా పారిశ్రామిక వేత్త‌లు అధికం…

ఇలాంటి యాక్సిడెంట్‌ను బ‌హుశా ఎప్పుడూ చూసి ఉండ‌ర‌ని అనుకోవ‌చ్చు.  ట్రాఫిక్ సిగ్న‌ల్‌ వ‌ద్ద వేగంగా వ‌చ్చిన ఓ కారు మ‌రో కారును ఢీకొట్టింది.  దీంతో ఆ కారు ఎగిరి అవ‌త‌ల ప‌డింది.  అలా ఎగిరిపడిన కారు కింద‌ప‌డ‌కుండా మ‌రో కారుముందున్న బానెట్‌పై ప‌డింది.  యాక్సిడెంట్‌తో ఎలాంటి సంబంధం లేని ఆ కారు ముందుభాగం దెబ్బ‌తిన్న‌ది.  ఈ ప్ర‌మాదానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.  ఈ సంఘ‌న‌ట యూఎస్‌లోని ఇండియానా రాష్ట్రంలో జ‌రిగింది.