తాజా స‌ర్వే: ఆ రాష్ట్రంలోనే మ‌హిళా పారిశ్రామిక వేత్త‌లు అధికం…

పురుషుల‌తో స‌మానంగా మ‌హిళ‌లు ఎదుగుతున్నారు.  ఉద్యోగాలు నిర్వ‌హిస్తున్నారు.  అన్ని ర‌కాల ప‌నులు చేస్తూ తాము సైతం ఎందులో త‌క్కువ‌కాద‌ని నిరూపిస్తున్నారు.  మ‌హిళా సాధికార‌తకు నిజ‌మైన అర్థాన్ని ఇస్తున్నారు.  దేశంలో ఎక్క‌డ ఎక్కువ మంది మ‌హిళా పారిశ్రామిక వేత్త‌లు ఉన్నారు అనే దానిపై మ‌ద్రాస్ ఐఐటీ సంస్థ ఓ స‌ర్వేను నిర్వ‌హించింది.  ఈ స‌ర్వేలో త‌మిళ‌నాడులోనే ఎక్క‌వ మంది మ‌హిళా పారిశ్రామిక వేత్త‌లు ఉన్న‌ట్టుగా తేల్చారు.  మ‌హిళ‌లు పారిశ్రామికంగా నిల‌బ‌డ‌టానికి వారి సామ‌ర్థ్యం, అనుభ‌వం, నెట్‌వ‌ర్కింగ్ కు అవ‌కాశం, కుటుంబ స‌భ్యుల నుంచి మ‌ద్ద‌తు వంటి విష‌యాలు స‌హాయ‌ప‌డ‌తాయ‌ని అధ్య‌యనంలో తేలింది.

Read: పాక్ మ‌ళ్లీ పాత‌పాటే… ఆ విమానం కూలిపోలేద‌ని వాద‌న‌…

 త‌మిళ‌నాడులోని మ‌హిళ‌ల‌కు వారి కుటుంబాల నుంచి మంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంద‌ని, అందుకే మ‌హిళా పారిశ్రామిక వేత్త‌లుగా స్త్రీలు అడుగులు వేస్తున్నార‌ని మ‌ద్రాస్ ఐఐటీ స‌ర్వేలో తేలింది.  ఆదాయం-లాభం వంటివి పెద్ద‌గా లేక‌పోయిన‌ప్ప‌టికీ తాము సంతృప్తితో ఉన్నామ‌ని, వ్యాపారాన్ని కొన‌సాగించ‌గ‌లుగుతున్నామ‌ని అంటున్నారు మ‌హిళ‌లు.  

Related Articles

Latest Articles