NTV Telugu Site icon

MS Dhoni: చెపాక్ స్టేడియంలో ధోనీ.. బ్యాటింగ్ ప్రాక్టీస్ తో బిజీ

Doni

Doni

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఈ సిజన్ లో తొలి మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ సారథి MS ధోని రంగంలోకి దిగారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మైదానంలోకి తిరిగి రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. దీంతో ధోనీ మొరుపుల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read:Pakistan: పార్లమెంట్‌లో కొత్త బిల్లును ప్రవేశపెట్టిన పాక్‌..

ఐపీఎల్ 2023 మ్యాచ్‌ ప్రారంభం సందర్బంగా మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ తొలిరోజే గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతోంది. దాంతో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. క్రీడాభిమానులు MS ధోనిని చెపాక్‌లో తిరిగి చూస్తారు. నాలుగుసార్లు ఐపిఎల్ ఛాంపియన్‌లుగా నిలిచిన సీఎస్కే జట్టు శుక్రవారం సీజన్ ఓపెనింగ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడనున్నారు. మొదటి మ్యాచ్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఆటగాళ్లని రెండుగా విభజించిన బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ.. ప్రాక్టీస్ మ్యాచ్‌ని ఆడించాడు. మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో హిట్టింగ్ చేసిన ధోనీ.. ఎక్కువగా మిడ్ వికెట్, స్ట్రయిట్ సిక్సర్లు కొడుతూ కనిపించాడు. ధోనీ సిక్సర్లు కొట్టిన ప్రతిసారీ స్టేడియాన్ని అభిమానులు కేరింతలతో హోరెత్తించారు.
Also Read:Healthy summer foods: వేసవిలో తినాల్సి కూరగాయాలు ఇవే

గత సీజన్‌లో కొద్దికాలం పాటు ఆ స్థానంలో ఉన్న రవీంద్ర జడేజా మినహా సూపర్ కింగ్స్‌కు పూర్తి స్థాయి కెప్టెన్ ధోనీ మాత్రమే. ఐపీఎల్ 2008లో ఫ్రాంచైజీలో చేరిన ధోనీ పసుపు రంగు జెర్సీని ధరించి తన జోరు కొనసాగించాడు. గత సీజన్‌లో ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైన తర్వాత, కోపంతో రవీంద్ర జడేజా నుండి కెప్టెన్సీని వెనక్కి తీసుకున్నాడు ధోనీ. ఐపీఎల్ లో మహేంద్రసింగ్ ధోనీ ఇప్పటి వరకు 234 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో 135.2 స్ట్రైక్‌రేట్‌తో 4978 పరుగులు చేశాడు ధోనీ. ఆయా మ్యాచ్ ల్లో 24 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా చెన్నైకి విజయాల్ని అందించిన ధోనీ.. నాలుగు సార్లు టైటిల్ విజేతగా కూడా నిలిపాడు. అయితే, IPL 2023 సీజన్ ఆటగాడిగా ధోనికి చివరిది అని ప్రచారం జరుగుతోంది.

Show comments