Site icon NTV Telugu

అతని తలనరికితే రూ.50 లక్షలు : కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

వివాదాస్పద షియా ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల దాస్నా ఆలయంలో ఇస్లాం మతం వీడి హిందు మతం స్వీకరించారు. ఆలయ పూజారి యతి నర్సింహానంద సరస్వతి ఆచారాలను నిర్వహించి వసీం రిజ్వీని హిందు మతంలోకి మార్చారు. అయితే అనంతర రిజ్వీ పేరు జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా మార్చినట్లు తెలిపారు. త్యాగిగా పేరు మార్చుకున్న రిజ్వీ మాట్లాడుతూ.. ఏ మతాన్ని అనుసరించాలనేది తన ఇష్టమని, కాబట్టి ప్రపంచంలోని పురాతన మతాన్ని స్వీకరించడానికి ఎంచుకున్నానని ఆయన వెల్లడించారు.

అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రషీద్‌ ఖాన్‌ హిందూమతంలోకి మారిన రిజ్వీ తల నరికితే రూ.50లక్షలు ఇస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో రిజ్వీ ఇస్లాం మత గ్రంధమైన ఖురాన్‌ నుంచి కొన్ని శ్లోకాలను తొలగించాలని కోరుతూ కోర్టుకెక్కాడు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు రిజ్వీకే రూ.50వేలు జరిమానా విధించింది. అనంతరం ఇస్లాం మత పెద్దలు ఆయన తీరు వ్యతిరేకిస్తూ ఇస్లాం నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో రిజ్వీ హిందు మతంలోకి మారాడు.

Exit mobile version