Site icon NTV Telugu

Atrocious: రూ.10 కోసం బాలుడి దారుణ హత్య..

Up Murder

Up Murder

రూ.10 కోసం ఓ బాలుడిని హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్‌కు వచ్చిన బాలుడు రూ.10 ఇవ్వలేదన్న కారణంతో పూల్ యజమాని తండ్రీ కొడుకులు బాలుడి గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత.. బాలుడి నోరు, ముక్కులో ఇసుక నింపారు. హత్య చేసిన అనంతరం సమీపంలోని చెరకు తోటలో పడేశారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకుని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడైన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.

Kalki First Day Collections : అదరగొట్టిన భైరవ.. ఫస్ట్ డే కల్కి 2898AD సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా ?

వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌కుమార్‌, అతని కుమారుడు వీర్‌పాల్‌లు పొలంలోనే అక్రమంగా స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మించారు. అయితే.. ఆ పూల్ లోకి వెళ్లాలంటే 10 రూపాయలు ఇవ్వాల్సిందే. కాగా.. ఆ గ్రామానికి చెందిన సీమా యాదవ్ 11 ఏళ్ల కుమారుడు ఆయుష్ యాదవ్ రోజూ పూల్ వద్దకు వెళ్లేవాడు. అందులోకి వెళ్లి డబ్బులు ఇవ్వకుండా తరచూ పారిపోయేవాడు. అయితే.. బుధవారం సాయంత్రం స్నానం చేయమని ఆయుష్‌ను ఇంటి నుంచి పంపించింది. తిరిగి సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లి ఆందోళనకు గురైంది. ఆమె స్విమ్మింగ్ పూల్‌లో బాలుడి కోసం వెతకడానికి వెళ్లినా అతని జాడ కనిపించలేదు. సీమ తన బంధువులతో కలిసి స్విమ్మింగ్ పూల్ చుట్టుపక్కల పొలాల్లో కొడుకు కోసం వెతికింది. బంధువులు ఆయుష్ కోసం రాత్రంతా వెతికారు. అయితే.. కొలనుకు 15 మీటర్ల దూరంలోని చెరుకు తోటలో బాలుడి మృతదేహం లభ్యమైంది.

Airtel: నిన్న జియో, నేడు ఎయిర్‌టెల్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ధరలు..

డీఐజీ మునిరాజ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి సీమ నుంచి సమాచారం తీసుకున్నారు. రూ.10 ఇవ్వలేదని స్విమ్మింగ్ పూల్ యజమాని రాజ్‌కుమార్, అతని కుమారుడు వీర్‌పాల్ తన నోటిలో, ముక్కులో ఇసుకను పోసి గొంతుకోసి హత్య చేశారని సీమ ఆరోపించింది. ఈ ఘటనపై వీర్‌పాల్‌ను విచారిస్తున్నట్లు నగర ఎస్పీ అఖిలేష్ భదౌరియా తెలిపారు. త్వరలో అతని తండ్రిని కూడా అరెస్టు చేయనున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో కూడా గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారించారు.

Exit mobile version