NTV Telugu Site icon

టెస్లా కారులో వీడియో గేమ్‌… తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు…

ఎల‌క్ట్రిక్ కార్ల రారాజు టెస్లా కంపెనీ డ్రైవ‌ర్ లెస్ కార్ల‌ను విప‌ణిలోకి తీసుకొచ్చేందుకు చాలా కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది.  అదుగో ఇదుగో అంటున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఆ టెక్నాల‌జీని అందిపుచ్చుకోలేదు.  డ్రైవ‌ర్‌లెస్ కార్ల‌పై ప‌లు అనుమానాలు ఉండ‌టంతో ఏ కంపెనీ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేయ‌లేదు.  కాగా, అయితే, టెస్లా కంపెనీ ఆటోపైల‌ట్ టెక్నాల‌జీపై ప‌రిశోధ‌న‌లు చేస్తూనే మ‌రో కొత్త ఫీచ‌ర్ ను రిలీజ్ చేసింది.  అదే వీడియో గేమ్ ఫీచ‌ర్‌.  మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అన్ని టెస్లా కార్లకు ఈ వీడియో గేమ్‌ను అప్‌డేట్ చేసింది.  

Read: పాలెం ఎయిర్‌పోర్ట్‌కు ప్ర‌ధాని మోడీ… ఆర్మీ అధికారుల‌కు నివాళులు…

కారు డ్యాష్ బోర్డు మీదున్న ట‌చ్ స్క్రీన్‌పై వీడియో గేమ్ ఆడుకోవ‌చ్చు.  డ్రైవ‌ర్ తో స‌హా ప‌క్క సీట్లో ఉన్న వ్య‌క్తులు కూడా వీడియో గేమ్ ఆడుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.  ఈ వీడియో గేమ్ ఫీచ‌ర్‌పై నెటిజ‌న్లు తిట్టిపోస్తున్నారు.  అస‌లే ప్ర‌మాదాలు అధికంగా జ‌రుగుతున్నాయ‌ని, ఈ స‌మ‌యంలో వీడియో గేమ్ ఆడుతూ డ్రైవింగ్ చేయ‌డం అంటే ప్రాణాల‌తో చెల‌గాటం ఆడ‌టం వంటిదే అని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.