NTV Telugu Site icon

గెల్లు భార్య వర్సెస్‌ తుల ఉమ.. పోలింగ్‌ కేంద్రం వద్ద రచ్చ.. రచ్చ..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ఉదయం 7 గంటలకే మొదలైంది. ఉదయం పలు కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌ నియోజకవర్గంలోని హిమ్మత్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ భార్య శ్వేత మాజీ జడ్పీ చైర్‌ పర్సన్‌ తుల ఉమల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నాన్‌ లోక్సల్స్‌ ఎందుకు నియోజకవర్గంలో ఉన్నారంటూ, ఓటర్లను ప్రలోభ పెడుతోందంటూ తుల ఉమను గెల్లు శ్వేత తన వర్గంతో అడ్డుకుంది.

దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే.. నియోజకవర్గంలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందకు ఉద్రిక్త వాతావరణం మధ్య పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. గత ఎన్నికల కంటే ఈ సారి పోలింగ్‌ శాతం అధికంగా ఉండేలా ఉందని ఎన్నికల అధికారులు అంటున్నారు.