తెలంగాణ వ్యాప్తంగా ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలతో చీఫ్ ఎలక్టోరల్ అధికారి శశాంక్ గోయల్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో ప్రత్యేక ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై చర్చ జరిగింది. అనంతరం ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించారు. నవంబర్ 1, 2021న ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం తెలంగాణలో 3,08,75,744 మంది ఓటర్లున్నారు. ఈ జాబితాలో పురుషులు 1,52,57,690 మంది, మహిళలు 1,50,97,292 మంది, థర్డ్ జెండర్ 1,683 మంది, సర్వీస్ ఓటర్లు 14,501 మంది, ఎన్నారై ఓటర్లు 2,742 మంది, పీడబ్ల్యూడీ ఓటర్లు 5,01,836 మంది ఉన్నారు.
Read Also: తెలంగాణలో మరో సీనియర్ రాజకీయ నాయకుడి పాదయాత్ర
Also Read
మరోవైపు తెలంగాణ ఓటు హక్కు లేని వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. దీని కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఈనెల 6,7,27,28 తేదీల్లో ఓటరు నమోదు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. మరోవైపు సోమవారం నుంచి ఈనెల 30 వరకు ఓటర్ల అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపింది. జనవరి 5, 2022న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని పేర్కొంది. కాగా ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గంలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఈ నెల 6న ప్రకటించనున్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలు, విజ్ఞప్తులను డిసెంబరు 6 వరకు స్వీకరిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్‌కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
Google Pixel 11a: గూగుల్ పిక్సెల్ 11a.. 8GB RAM, 120Hz డిస్ప్లే, Tensor G6 చిప్సెట్.. కొత్త ఫీచర్లు ఇవే!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!