Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Telangana Mlc Elections Polling On December 10th

తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు రేపే పోలింగ్

Published Date :December 9, 2021 , 9:12 pm
By Ramesh Nalam
తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు రేపే పోలింగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం నాడు ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది. వీటిలో ఇప్పటికే ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు రేపు పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు 10 మంది అభ్యర్థులు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క స్థానానికి ఏడుగురు అభ్యర్థులు, ఆదిలాబాద్‌లో ఒక్క స్థానానికి ఇద్దరు, ఖమ్మంలో ఒక్క స్థానానికి నలుగురు, మెదక్ జిల్లాలో ఒక్క స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Read Also: సచివాలయ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

రేపటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేవారు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించి తమ ఓటు వినియోగించుకోవాలని ఎన్నికల అధికారి శశాంక్ సూచించారు. పోలింగ్ సిబ్బంది, ఓటర్లు తప్పకుండా గ్లౌస్, మాస్కులు ధరించి పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని కోరారు. ఎవరైనా ఓటర్లకు కరోనా పాజిటివ్ వస్తే.. అలాంటి వారికి చివరి గంటలో ఓటు హక్కును వినియోగించుకునేలా అనుమతి ఇస్తామని శశాంక్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8 పోలింగ్ స్టేషన్‌లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 పోలింగ్ స్టేషన్‌లు, ఉమ్మడి మెదక్ జిల్లాలో 9 పోలింగ్ స్టేషన్‌లు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8 పోలింగ్ స్టేషన్‌లు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు జరిగే ఆయా జిల్లాల్లో పోలింగ్ ముగిసేవరకు మద్యం అమ్మకాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • election commission
  • election updates
  • MLC ELECTIONS
  • MLC Elections 2021
  • telangana

తాజావార్తలు

  • Raaka: అల్లు అర్జున్ రాకా’కు అర్ధమేంటో తెలుసా?

  • Yashasvi Jaiswal: ముంబై అంటేనే శివాలెత్తుతున్న జైస్వాల్.. బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది!

  • Anna Lezhneva: ఆయనే ఫస్ట్ ప్రపోజ్ చేశారు.. షాకింగ్ విషయాన్ని బయటపెట్టిన పవన్ భార్య

  • 1857 UNTOLD STORY: చరిత్ర దాచిన పేరు..దళితుడు అని నీళ్లు కూడా ఇవ్వలేదు.. సీన్‌ కట్ చేస్తే బ్రిటీషర్లపై యుద్ధం!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions