Site icon NTV Telugu

ఆశతో వచ్చాం.. కేంద్రం నిరాశపరిచింది..

ఆశతో హస్తినకు వచ్చాం.. కానీ, కేంద్ర ప్రభుత్వం నిరాశపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి… కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. యాసంగిలో వరి వేయొద్దని కేంద్రం గట్టిగా చెప్పిందని తెలిపారు. మేం ఎంతో ఆశతో వచ్చాం.. కానీ, కేంద్రం నిరాశపరిచిందన్న ఆయన.. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించాం.. కానీ, నిరాశే మిగిలిందన్నారు. కేంద్రమంత్రితో జరిగిన సమావేశంలో.. కేంద్రం ఎంత కొనుగోలు చేస్తుందో టార్గెట్‌ చెప్పమన్నాం అని తెలిపిన నిరంజన్‌రెడ్డి.. అయితే, ఏడాదికి ఒకేసారి టార్గెట్‌ ఇవ్వలేమని కేంద్రం చెప్పిందన్నారు. కేంద్ర మంత్రితో చర్చించిన అంశాలు.. వారి స్పందనను సీఎం కేసీఆర్‌కు వివరిస్తామని.. భవిష్యత్‌ కార్యాచరణపై కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు నిరంజన్‌రెడ్డి..

తెలంగాణ రైతుల పక్షాన కేంద్రంతో చర్చించడానికి వచ్చాం.. పరిష్కారం దొరుకుతుందని ఆశించాం.. కానీ, సానుకూల నిర్ణయం రాలేదన్నారు నిరంజన్‌రెడ్డి.. తెలంగాణ రైతాంగం ప్రయోజనాల కోసం మరోమారు కేంద్రం ఆహ్వానం మేరకు చర్చలకు రావడం జరిగింది.. తెలంగాణ రైతాంగానికి ఒక పరిష్కారం చూపిస్తుందన్న బలమైన ఆశతో వచ్చాం.. రెండు సార్లు సమావేశం జరిగినా అశాజనకంగా వారిచ్చిన హామీ అయితే ఆశాజనకంగా లేదు. ఒక విషయం స్పష్టం చేశారు. యాసంగిలో వరి వేయవద్దని గట్టిగా చెప్పారని తెలిపారు నిరంజన్‌రెడ్డి.. తెలంగాణ బీజేపీ నేతలు గందరగోళం చేస్తున్నారని కేంద్రమంత్రికి చెప్పామన్న ఆయన.. వాళ్లు తెలిసో తెలియకో మాట్లాడినారు.. అలా మాట్లాడవద్దు అని వారించామని కేంద్ర మంత్రి చెప్పారన్నారు.. యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోమని కేంద్ర మంత్రి చెబుతున్నారు.. ఒక సంవత్సర కాలానికి టార్డెట్ ఎంతనో.. ఏ పరిమాణంలో ధాన్యం తీసుకుంటారో చెప్పాలని సీఎం కేసీఆర్ కోరారని.. దానికి అనుగుణంగా రైతాంగాన్ని సన్నధం చేసుకుంటామని సీఎం చెప్పారన్న ఆయన.. కేసీఆర్ సూచన బాగుందని కేంద్ర మంత్రి చెప్పినట్టు వెల్లడించారు.. కానీ, వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడితే ముందస్తుగా టార్గెట్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినట్లు తెలిపారు.. ఇక, త్వరలో ఒక కమిటీ వేయబోతున్నాం.. కొత్త వ్యవసాయ చట్టాలు, కనీస మద్ధతు ధర, పంటల మార్పుకు సంబంధించి ఒక విధాన నిర్ణయం తీసుకునేందుకు కమిటీ పనిచేస్తుందని కేంద్ర మంత్రి చెప్పారని.. కమిటీ నిర్ణయాన్ని బట్టి అప్పుడు చెప్తామంటున్నారని.. పంట కోతలు ప్రారంభం అయి చాలా రోజులు అవుతోంది. కొనుగోళ్లు సాగుతున్నాయి. ఈ సంవత్సరానికి ఎంత సేకరిస్తారని అడిగితే గత విధానాన్నే అవలంభిస్తామని యధాలాపంగా గోయల్ చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version