Site icon NTV Telugu

ఒమిక్రాన్ వేరియంట్ కేసులపై తెలంగాణ వైద్యశాఖ కీలక ప్రకటన

తెలంగాణలో ఇంకా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కాలేదని… తెలంగాణ వైద్య శాఖ ప్రకటన చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 13 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపింది. ఈ రోజు సాయంత్రం వరకు జీనోమ్ సిక్వెన్స్ ఫలితాలు వచ్చే అవకాశమని.. తెలంగాణ వైద్య శాఖ పేర్కొంది.

ఈ మహమ్మరిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజల భాగస్వామ్యం అవసరమని.. హైదరాబాద్ లో రేపో మాపో కొత్త వేరియంట్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది వైద్యశాఖ. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని… ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది వైద్యశాఖ. ప్రాణాలు తీసే గుణం ఒమిక్రాన్ లో లేదని నిపుణులు చెబుతున్నారని..థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు వైద్య శాఖ సిద్ధంగా ఉందని తెలిపింది వైద్యశాఖ.

Exit mobile version