తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలు జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణను ఊపేసిన వర్షం ఆదివారం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.. గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా మళ్లీ వర్షాలు దంచికొడతాయని అధికారులు చెబుతున్నారు. గురువారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి..…