NTV Telugu Site icon

మందు బాబులకు ఇక కిక్కే… న్యూఇయర్‌కి ప్రత్యేక అనుమతులు..

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందు బాబులకు కిక్కే న్యూస్‌ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం… డిసెంబర్‌ 31వ తేదీతో పాటు, జనవరి 1న కూడా బార్లు, వైన్‌ షాపులు, స్పెషల్‌ ఈవెంట్లకు ప్రత్యేక అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్… డిసెంబర్ 31, 2022 జనవరి 1వ తేదీల్లో బార్లు, క్లబ్బులు అర్థరాత్రి ఒంటి గంట వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.. ఇక, డిసెంబర్ 31న వైన్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉండనున్నాయి.. బార్స్‌, ఈవెంట్స్‌, టూరిజం హోటల్స్ కు రాత్రి ఒంటి గంట వరకు అనుమతి ఉంటుందని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ సమయంలో.. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే, ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌తో కొన్ని రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూ విధిస్తున్నాయి.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సర్వీసులకు మినహా.. ఎలాంటి వాటికి అనుమతి ఇవ్వడం లేదు.. కానీ, తెలంగాణ సర్కార్‌ మాత్రం.. ప్రత్యేకంగా అనుమతి ఇవ్వడం చర్చగా మారింది.. మొత్తానికి మందు బాబులకు మాత్రం కిక్కిచ్చే కబురు చెప్పింది సర్కార్.