మరో గ్రామంపై కేసీఆర్ ఫోకస్..? వారం పదిరోజుల్లో కాశిరెడ్డిపల్లికి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు సీఎం కేసీఆర్.. ఇవాళ ఆ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు.. దళిత వాడల్లోని సుమారు 60 ఇళ్లోకి వెళ్లి కాలినడకన పర్యటిస్తూ ప్రతి ఒక్కరినీ యోగక్షేమాలు, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతే కాదు.. సీఎం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళిత బంధు పథకం కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తున్నట్టు.. రేపటి నుంచి వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నాం. రేపట్నుంచే దళితుల చేతుల్లో రూ. 10 లక్షల చొప్పున డబ్బులు ఉంటాయని ప్రకటించారు.. ఇప్పుడు మరో గ్రామంపై కేసీఆర్ ఫోకస్ పెట్టారా? అనే చర్చ సాగుతోంది.. అదే సిద్దిపేట జిల్లాలోని కాశిరెడ్డిపల్లి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వాసాలమర్రి పర్యటన ముగించుకుని తిరిగి ఫామ్ హౌజ్ కి వెళ్తున్న క్రమంలో సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కాశిరెడ్డిపల్లి గ్రామం వద్ద కాన్వాయ్ ఆపి గ్రామస్తులతో మాట్లాడారు సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా కాశిరెడ్డిపల్లి సర్పంచ్ స్వరూప.. ఆమె భర్త మల్లేశం గ్రామ అభివృద్ధి కోసం సహాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు.. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. వారం పది రోజుల్లో నేను మీ గ్రామానికి వస్తానని, గ్రామ ప్రజలతో కలిసి భోజనం చేసి వెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో.. కేసీఆర్ మరో గ్రామంపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది… గతంలో వాసాలమర్రిలో పర్యటించిన సీఎం.. అందరితో కలిసి భోజనం చేశారు.. ఇప్పుడు కాశిరెడ్డిపల్లికి కూడా వెళ్లనున్నారు అంటే.. ఆ గ్రామానికి మహర్దశ పట్టనుందా? అనేది చూడాలి మరి.
Also Read
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!