NTV Telugu Site icon

ఒక్క పైసా కేంద్రానిదైనా.. ఒక‌టే నిమిషంలో సీఎం ప‌ద‌వికి రాజీనామా..!

తెలంగాణ ప్రభుత్వం పథకాలకు ఖర్చు చేసే ప్రతీ పైసా కేంద్రం నుంచే వస్తుందంటూ పలు సందర్భాల్లో బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు.. ఒక, గొల్ల కురుమల కోసం ప్రభుత్వం అందిస్తున్న గొర్రెల పంపిణీ పథకంలోనూ కేంద్రం నిధులున్నాయని విమర్శించింది బీజేపీ.. అయితే, గొర్రెల పంపిణీ పథకంలో ఒక్క పైసా కేంద్రం వాటా ఉన్నా సీఎం పదవీకి రాజీనామా చేస్తానంటూ సవాల్‌ విసిరారు.. టీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రగతి భవన్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. గొర్రెల పంపిణీ ఈ పథకం కోసం అప్పు తీసుకుని వడ్డీ కడుతున్నామని వెల్లడించారు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఈ పథకం లేదు? అంటూ నిలదీశారు.. నీవు ఇచ్చింది ఏం తోక‌.. అబద్దాలు మాట్లాడ‌టం స‌రికాదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో కూడా తెలంగాణ‌లో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు కావ‌డం లేదన్నారు..

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో షాదీ ముబార‌క్, క‌ల్యాణ‌ల‌క్ష్మి, పెన్షన్లు ఇస్తున్నారా? పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లపై మాట్లాడితే ప‌క్క దేశాల‌కు పోవాల‌ని అంటున్నారు. అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు మండిప‌డ్డారు సీఎం కేసీఆర్… తెలంగాణ బిల్లు పాసైన‌ప్పుడు కేసీఆర్ ఓటేయ‌లేదు అని బండి సంజయ్ అంటున్నాడు. ఆయ‌న మాట‌లు వింటుంటే ఏం చేయాలో అర్థం కావ‌డం లేదని ఎద్దేవా చేశారు.. తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడ‌. నువ్వు ఎవ్వనికి తెలుసు ఈ రాష్ట్రంలో అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. ఇప్పుడొచ్చి దుంకుతా అంటే న‌డ‌వ‌దు.. క‌థ తేల్చే దాకా నేనే మాట్లాడుతా.. వ‌దిలిపెట్టను.. ప్రతి రోజు మాట్లాడుతా.. గార‌డీ చేస్తామంటే న‌డ‌వ‌నివ్వను అంటూ హెచ్చరించారు. మరోవైపు కర్ణాటకలో ప్రభుత్వం కూల్చి దొడ్డి దారిన ప్రభుత్వం నడుపుతున్నారని ఆరోపించారు కేసీఆర్.. ప్రభుత్వాలను కూల్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేశారన్న ఆయన.. తెలంగాణలో 107 సీట్లలో బీజేపీ డిపాజిట్ పోయిందని గుర్తుచేవారు.. నాగార్జున సాగర్ లో కూడా బీజేపీ డిపాజిట్ పోయిందన్న ఆయన.. ప్రజల పక్షాన మాట్లాడితే దేశద్రోహం అంటారు… తెల్లారితే ఐటీ దాడులు చేస్తారు అంటూ ఫైర్ అయ్యారు.. పిట్ట బెదిరింపులకు బెడిరిపోం.. బండి సంజయ్ జాగ్రత్తగా మాట్లాడలని వార్నింగ్‌ ఇచ్చారు కేసీఆర్.