Site icon NTV Telugu

హస్తినలోనే కేసీఆర్‌ మకాం.. రేపు మరికొన్ని భేటీలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. హస్తినలో మకాం వేశారు.. మొదట మూడు రోజుల పర్యటన అంటూ ఢిల్లీ బయల్దేరిన సీఎం.. ఇప్పుడు హస్తిన పర్యటనను పొడిగించారు.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన ఆయన.. ఇవాళ కూడా ఢిల్లీలోనే బస చేయనున్నారు.. రేపు మరికొన్ని భేటీలు జరగనున్నట్టు తెలుస్తోంది.. సోమవారం రోజు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలిసే అవకాశం ఉండగా.. రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ను కూడా కలిసి యాదాద్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఢిల్లీలో టీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయం శంకుస్థాపన కోసం ఈ నెల 1వ తేదీన హస్తిన బాట పట్టిన ఆయన.. గత ఐదు రోజులుగా అక్కడే మకాం వేశారు.. సోమవారం మరికొన్ని భేటీ ఉన్నాయని తెలుస్తుండడంతో.. మరో రోజు ఆయన పర్యటన పొడిగించినట్టే.

Exit mobile version