NTV Telugu Site icon

సిజెఐ రమణ జోక్యంతో మారిన సిబిఐ చీఫ్ ఎంపిక…

కేంద్రం పంజరంలో చిలుకగా పేరు మోసిన సిబిఐ డైరెక్టర్‌ ఎంపిక భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌విరమణ జోక్యంతో కొత్త మలుపు తిరగడం కీలక పరిణామం. సిబిఐ డైరెక్టర్‌ ఎంపిక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు,సిజెఐ సభ్యులుగా వుంటారు. కేంద్ర క్యాబినెట్‌ తుది నిర్ణయం తీసుకుంటుంది గనక ఈ కమిటీ చర్చలు లాంఛనంగానే పరిగణించబడేవి. ఈసారి బిఎస్‌ఎప్‌ డైరెక్టర్‌గా వున్న రాకేశ్‌ ఆస్తానా, ఎన్‌ఐఎ బాస్‌ వైసిమోడీ పేర్లు తుది జాబితా నుంచి ఎగిరిపోయాయి. రాకేశ్‌ ఆస్తానాను ప్రధాని మోడీ కోరి గుజరాత్‌ తెచ్చి సిబిఐలోప్రత్యేక బాధ్యత ఇవ్వడం.ఆయన అప్పటి డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మపైనే ఆరోపణలు విచారించడం. ఇందుకు ప్రతిగా ఆలోక్‌ వర్మ రాకేశ్‌పై శిక్షణా చర్యలు తీసుకోవడం పెద్ద రభసకు దారితీసింది. ఇప్పుడు సిఐఎస్‌ఎప్‌ చీఫ్‌ సుబోధ్‌ జైశ్వాల్‌, ఎస్‌ఎస్‌బి డైరెక్టర్‌ కెఆర్‌ చంద్ర,హోంశాఖలో ప్రత్యేక కార్యదర్శిగా వున్న వికెకౌముది మిగిలారు.ఎవరైనాసరే కేవలం ఆరుమాసాల సర్వీసుమాత్రమే మిగిలివున్న వారిని సిబిఐ బాస్‌గా నియమించరాదని సుప్రీంకోర్టు మూడుతీర్పుల్లో ఆదేశించిన విషయం సిజెఐరమణ గుర్తుచేయడంతో ఆ ప్రకారమే ప్రధాని మోడీకూడా అంగీకరించారు.దాంతోముందే తయారైన 16మందిజాబితాలో 11వ పేరులనుంచి పరిశీలన ప్రారంభిస్తే ఈ మూడుపేర్లుతేలాయి.వీరిలో సుభోధ్‌జైశ్వాల్‌ మహారాష్ట్ర క్యేడర్‌ముంబైపోలీసుకమిషనర్‌గా పనిచేశారు. ఆంధ్రక్యాడర్‌కు చెందిన కౌముది గతంలో హైదరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌ గానూ విశాఖ కమిషనర్‌గానూ బాధ్యతు నిర్వహించిన వ్యక్తి.కేంద్ర సంస్థలోనూ పలుబాధ్యతలు నిర్వహించారు కెఆర్‌ చంద్ర బీహార్‌ క్యాదర్‌.

వాస్తవానికి అధీర్‌ రంజన్‌ కూడా కేంద్ర వైఖరికి అభ్యంతరం చెప్పారు. తమకు సోమవారం ఉదయం 109 మందితో కూడిన జాబితా ఇచ్చారని తీరా సమావేశం సమయానికి అధికారులే కుదించి 16మందిని సూచించడమేమిటని ప్రశ్నించారు.ఇందులో కొందరిని తగ్గించి కొందరిని కొనసాగించడానికి కారణమేమిటో అధికారులు చెప్పకపోవడం తన అభ్యంతరమని ఆయన వివరించారు.ఈ రోజు తుదిజాబితాలోని పేర్లపై తమ అభిప్రాయాలతో సిజెఐ, ప్రతిపక్ష నేత ప్రధాని కార్యాలయానికి నోట్‌ పంపుతారు. ప్రధాని హొంమంత్రితో కూడిన కేబినెట్‌ నియామకాల కమిటీ తుది ఉత్తర్వు ఇస్తుంది. ఈ ముగ్గురిలోనూ సుబోధ్‌ జైశ్వాల్‌ పట్లనే కేంద్రం ఆసక్తిగా వున్నట్టు చెబుతున్నారు.

నరేంద్ర మోడీ హయాంలో సిబిఐతో సహా కేంద్ర సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఇష్టానుసారం ప్రయోగించడం ప్రతిపక్షా విమర్శలకు గురవుతున్నది.తాజాగా బెంగాల్‌ ఎన్నిక అనంతరం నారద కుంభకోణంలో నిందితుగా వున్న టిఎంసి మంత్రులను ఎంఎల్‌ఎను అరెస్టుచేశారు. అదే సమయంలో బిజెపిలోకి ఫిరాయించిన వారిని వదలిపెట్టారు. ఇలాంటి ఉదాహరణలకు లెక్కేలేదు. ఇలాంటి సమయంలో సిబిఐ అధినేతగా ఎవరు వస్తారన్నది రాజకీయ ప్రాధాన్యత గల విషయం. ఆరు మాసాల పదవీ కలం మాత్రమే మిగిలిన వారిని ఎంపిక చేస్తే తర్వాత పొడగింపుకోసం వారు కేంద్రం చెప్పిందంతా చేసేందుకు సిద్ధపడతారనేది సుప్రీంకోర్టు ఉద్దేశం అనుకోవాలి. ఈ విషయంలో సిజెఐ పట్టుపట్టకపోతే మోడీసర్కార్‌ మొదట అనుకున్న వారినే ఎంపిక చేయడం జరిగేదేమో, ఇక ఇప్పుడు కొత్త అధినేత ఆధ్వర్యంలో సిబిఐ ఎలా పనిచేసేది చూడవలసి వుంటుంది.