NTV Telugu Site icon

land for job case: నేడు ఈడీ ముందుకు తేజస్వి… బిహార్ డిప్యూటీ సీఎంపై ఉచ్చు బిగుస్తోందా?

Tejashwi Yadav

Tejashwi Yadav

రైల్వే భూముల కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మంగళవారం ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరు కానున్నారు. తేజస్వి ఉదయం 11 గంటలకు విచారణలో చేరే అవకాశం ఉంది. ఇదే కేసులో మార్చి 25న తేజస్వీ యాదవ్ ను సీబీఐని ప్రశ్నించింది.

సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద ప్రత్యేక కేసు నమోదు చేసిన ఈడీ, మంగళవారం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వి యాదవ్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. తేజస్వి యాదవ్ సోదరి రాజ్యసభ సభ్యురాలు మిసా భారతిని కూడా ఈ కేసులో ఈడీ మార్చి 25న ప్రశ్నించింది.
Also Read:Beer Bus: చెన్నై నుండి పుదుచ్చేరి.. బీర్ బస్ ప్రయాణం.. ఇందులో విశేషమేమిటంటే..

ఆర్జెడి చీఫ్ కుటుంబంపై ED దాడులు నిర్వహించింది. లాలూ ప్రసాద్, ఆయన భార్య , బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని సిబిఐ ప్రశ్నించడంతో రెండు కేంద్ర ఏజెన్సీలు ఇటీవల ఈ కేసులో చర్య ప్రారంభించాయి. ఈడీ సోదాల అనంతరం రూ. 1 కోటి లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 350 కోట్ల స్థిరాస్తులు, వివిధ బినామీదార్ల ద్వారా రూ. 250 కోట్ల లావాదేవీలు జరిగినట్లు క్రైమ్ (పీఓసీ) రూపంలో దాదాపు రూ.600 కోట్లు గుర్తించినట్లు ఈడీ పేర్కొంది.

కేంద్రంలోని యూపీఏ-1 ప్రభుత్వంలో ప్రసాద్‌ రైల్వే మంత్రిగా ఉన్న కాలానికి సంబంధించి ఈ కుంభకోణం జరిగింది. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి బదులుగా లాలూ ప్రసాద్ కుటుంబం పాట్నా, ఇతర ప్రాంతాల్లోని ప్రముఖ ప్రదేశాలలో అనేక భూములను అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పటివరకు జరిపిన పీఎంఎల్‌ఏ దర్యాప్తులో తేలిందని ఈడీ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ భూముల విలువ రూ.200 కోట్లకు పైగానే ఉంది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం ఈ భూములకు సంబంధించి పలువురు బినామీదార్లు, షెల్ ఎంటీటీలు, లబ్ధిదారులను గుర్తించారు.
Also Read:Balochistan Bomb Blast: బలూచిస్తాన్‌లో బాంబు పేలుడు.. నలుగురు మృతి, 18 మందికి గాయాలు

లాలూ కుటుంబం, వారి సహచరుల తరపున రియల్ ఎస్టేట్ సహా వివిధ రంగాలలో పెట్టిన మరిన్ని పెట్టుబడులను వెలికితీసేందుకు దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది. తేజస్వి యాదవ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, దక్షిణ ఢిల్లీలోని D-1088, న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఉన్న ఆస్తి A B ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్టర్ చేయబడిన స్వతంత్ర 4-అంతస్తుల బంగ్లా అని ED తెలిపింది. ఈ కంపెనీ తేజస్వి యాదవ్, అతని కుటుంబ సభ్యులచే యాజమాన్యం నియంత్రణలో ఉంది అని ED పేర్కొంది. ఈ ఇంటిని కేవలం రూ. 4 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపింది. అయితే దీని ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ. 150 కోట్లుగా వెల్లడించింది.