సారథికి విజయంతో వీడ్కోలు

టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా విజయంతో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన భారత్.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీకి వీడ్కోలు పలికింది. సారథిగా విరాట్ కోహ్లీకి ప్రపంచకప్ అందించలేకపోయిన ఆటగాళ్లు.. కెప్టెన్‌గా అతడి ఆఖరి మ్యాచ్‌లో మాత్రం గెలిచి విజయాన్ని కానుకగా అందించారు. నమీబియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

Read Also: హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ అదిరే రికార్డు

ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు సాధించింది. భారత బౌలర్లు ఏకంగా 58 డాట్ బాల్స్ వేయడం విశేషం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన జడేజా, మరో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ మూడేసి వికెట్లతో రాణించారు. బుమ్రా 2 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో టీమిండియా దూకుడుగా బ్యాటింగ్ చేసింది. మనవాళ్లు 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకున్నారు. రోహిత్ (56), కేఎల్ రాహుల్ (54 నాటౌట్) ఇద్దరూ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.