తమ బిడ్డను కొట్టాడనే కారణంతో ఓ ఉపాధ్యాయుడిని చితక్కొట్టారు విద్యార్థి తల్లిదండ్రులు. స్కూల్‌లో టీచర్‌ను కొట్టినందుకు రెండో తరగతి విద్యార్థి తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని టుటికోరిన్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చోటుచేసుకుంది. ఉపాధ్యాయుడిని ఆర్ భరత్‌గా గుర్తించారు.
Alsor Read:Gangavva Panchangam: సినీ స్టార్స్, రాజకీయ ప్రముఖుల పంచాంగం.. గంగవ్వ నోట..
దంపతులు తమ బిడ్డను కొట్టారని ఆరోపిస్తూ క్లాస్‌రూమ్‌లోకి దూసుకెళ్లి టీచర్‌తో వాగ్వాదం చేశారు. విద్యార్ధిని కొట్టడం చట్ట విరుద్ధమని తల్లి సెల్వి చెప్పింది. పిల్లవాడిని కొట్టే హక్కులు ఎవరు ఇచ్చారు? అంటూ చెప్పులతో కొట్టింది. ఇతర పిల్లలు చూస్తుండగానే, తండ్రి శివలింగం తరగతి గది చుట్టూ ఉపాధ్యాయుడిని వెంబడించి కొట్టాడు. రాయిలా కనిపించే ఒక చిన్న వస్తువును కూడా ఉపాధ్యాయునిపైకి విసిరే ప్రయత్నం చేశాడు. భార్యాభర్తలు భరత్‌పై దాడి చేయడంతో మరో టీచర్ సహాయం కోసం కేకలు వేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. దంపతులను అదుపులో తీసుకున్నారు. స్కూల్‌లో టీచర్‌ను కొట్టినందుకు రెండో తరగతి విద్యార్థి తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Alsor Read:Blast at Cracker Factory: బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది సజీవదహనం
దాడి, నేరపూరిత బెదిరింపు, కుట్ర, ప్రభుత్వ ఉద్యోగిని విధులు నిర్వర్తించకుండా నిరోధించడం వంటి నేరాల కింద వారిపై కేసు నమోదు చేశామని పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్ బాలాజీ శరవణన్ చెప్పారు.విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
Alsor Read:PM Modi: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కాసేపట్లో ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష
ఏడేళ్ల చిన్నారి క్లాస్‌లో ఇతర పిల్లలతో గొడవపడుతుండడంతో సీటు మార్చాల్సిందిగా ఉపాధ్యాయుడు ఆమెను కోరినట్లు అధికారులు పేర్కొంటున్నారు. సీట్లు మారుతున్న సమయంలో ఆమె పడిపోయిందని పోలీసులు తెలిపారు. టీచర్ తనను కొట్టాడని చిన్నారి ఇంటికి వెళ్లి తాతయ్యకు ఫిర్యాదు చేసింది.దీంతో ఆగ్రహించిన చిన్నారి తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లి టీచర్ పై దాడి చేశారు. కాగా, పోలీసులు దంపతులతో పాటు చిన్నారి తాత మునుసామిని కూడా అదుపులోకి తీసుకున్నారు.