బద్వేల్ ఉప ఎన్నికలు అక్టోబర్ 30 వ తేదీన జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో విజయం తమదే అని టీడీపీ ధీమాను వ్యక్తం చేసింది. దివంగత మాజీ మంత్రి వీరారెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంతో అభివృద్ది చేశారని టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ పేర్కొన్నారు. సీఎం జగన్ బద్వేల్ అభివృద్ధికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. బద్వేల్ లో వైసీపీ నేతల అరాచకాలు, ఆక్రమణలు ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. వైసీపీ అభ్యర్థి దాసరి సుధను ప్రజలు గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండరని ఆయన పేర్కొన్నారు. తాను బద్వేల్‌లోనే ఉంటానని, జనం సమస్యలను పరిష్కరిస్తానని టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ పేర్కొన్నారు.
Read: సోము వీర్రాజుతో పవన్ భేటీ… ఈ విషయాలపై చర్చ…