సోము వీర్రాజుతో ప‌వ‌న్ భేటీ… ఈ విష‌యాల‌పై చ‌ర్చ‌…

అక్టోబ‌ర్ 30 వ తేదీన క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేల్ కు ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.   ఈ ఉప ఎన్నిక‌ల్లో జ‌న‌సేప పార్టీ బ‌ద్వేల్ నియోజ‌క వ‌ర్గం నుంచి పోటీ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.  తిరుప‌తి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ పోటీ చేసిన కార‌ణంగా ఈసారి బ‌ద్వేల్ నియోజ‌క వ‌ర్గంలో పోటీ చేసే అవ‌కాశం జ‌న‌సేన‌కు ఇచ్చిన‌ట్టు బీజేపీ నేత‌లు చెబుతున్నారు.  అయితే, జ‌న‌సేన నుంచి ఎవ‌రు పోటీలో ఉంటారు అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.  ఈ నేప‌థ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిశారు.  వివిధ అంశాల‌పై చ‌ర్చించారు.  బ‌ద్వేలు ఉప ఎన్నిక‌తో పాటుగా, రాష్ట్రంలోని తాజా పరిణామాల‌పై కూడా ఇరువురు నేత‌లు చ‌ర్చించారు.  అక్టోబ‌ర్ 2 వ తేదీన జ‌న‌సేన పార్టీ త‌ల‌పెట్టిన శ్ర‌మ‌దానం కార్య‌క్ర‌మం వివ‌రాల‌ను సోము వీర్రాజుకు ప‌వ‌న్ వివ‌రించారు.  అటు అక్టోబ‌ర్ 7 వ తేదీన నెల్లూరులో బీజేపీ మ‌త్స్య గ‌ర్జ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే.  ఈ మ‌త్స్య గ‌ర్జ‌న కార్య‌క్ర‌మం వివ‌రాల‌ను ప‌వ‌న్‌కు సోము వీర్రాజు వివ‌రించారు.  

Read: బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌కు చురుగ్గా ఏర్పాట్లు…

-Advertisement-సోము వీర్రాజుతో ప‌వ‌న్ భేటీ... ఈ విష‌యాల‌పై చ‌ర్చ‌...

Related Articles

Latest Articles