టీడీపీ ఎంపీ కేశినేని నాని అలక వీడినట్లేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున కేశినేని నాని ఎంపీగా విజయం సాధించారు. అయితే ఇటీవల ఆయన టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో కేశినేని నాని పార్టీ మారతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షకు శుక్రవారం నాడు ఎంపీ కేశినేని నాని సంఘీభావం ప్రకటించారు. తాజా పరిణామంతో తెలుతు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని అలక వీడినట్లే అని అభిప్రాయపడుతున్నారు.
Read Also: టీడీపీని బీజేపీలో కలిపేస్తారు.. డొక్కా సంచలన వ్యాఖ్యలు
Also Read
కాగా కొద్దిరోజుల క్రితం ఎంపీ కేశినేని నాని చంద్రబాబుపై వ్యతిరేకత చూపించారు. కేశినేని భవన్‌లో చంద్రబాబు ఫోటోను తొలగించి ఆ స్థానంలో ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా ఫోటోను ఉంచారు. దీంతో కేశినేని నానికి, టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్య విభేదాలు వచ్చాయని మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ కథనాలను ఎంపీ కేశినేని నాని ఖండించకపోవడంతో ఆయన పార్టీ మారేది ఖాయమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు భావించారు. తీరా కట్ చేస్తే శుక్రవారం నాడు ఆయన టీడీపీ కార్యాలయానికి వెళ్లి తమ అధినేత చంద్రబాబు దీక్షకు మద్దతు ప్రకటించారు. కాగా ఇటీవల విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కేశినేని నాని తన కుమార్తెను ఎన్నికల్లో నిలబెట్టగా.. ఆమె టీడీపీ తరఫున కార్పొరేటర్‌గా విజయం సాధించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
-
Motorola Edge 60 Fusion 5G: మోటరోలా Edge 60 Fusion 5G.. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?