ఆచంట ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకున్నది. మొత్తం 17 ఎంపీటీసీలు ఉన్న ఆచంటలో టీడీపీ 7 చోట్ల, వైసీపీ 6 చోట్ల, జనసేన 4 చోట్ల విజయం సాధించింది. దీంతో, టీడీపీ, వైసీపీలు ఇద్దరిలో ఎవరు ఎంపీపీ కావాలి అన్నా జనసేన మద్ధతు అవసరంగా మారింది. క్యాంపు రాజకీయాలు షురూ కావడంతో టీడీపీ, జనసేన పార్టీలు తమ ఎంపీటీసీలను రహస్యప్రాంతాలకు తరలించారు. కాగా, ఈ ఎంపీపీ పదవి కోసం టీడీపీ, జనసేన పార్టీలు పొత్తును కుదుర్చుకున్నాయి. పొత్తులో భాగంగా ఆచంట ఎంపీపీ పదవి టీడీపీ దక్కించుకోగా, ఉప ఎంపీపీ పదవిని జనసేన పార్టీ దక్కించుకున్నది. ఎలాగైనా ఎంపీపీని కైవసం చేసుకోవానుకున్న వైపీపికి టీడీపి, జనసేనలు కలిసి ఇలా షాక్ ఇచ్చాయి.
Read: ఇస్లామిక్ చట్టాల ప్రకారమే శిక్షలు… తాలిబన్ల కీలక నిర్ణయం…