NTV Telugu Site icon

టౌటే ఎఫెక్ట్: పశ్చిమ తీరం అతలాకుతలం… వణికిపోయిన ముంబై

టౌటే తుఫాన్ ధాటికి ప‌శ్చిమ తీరం అత‌లాకుత‌లం అయింది.  క‌న్యాకుమారి నుంచి కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, మహారాష్ట్ర‌, గోవా, గుజ‌రాత్ రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప‌శ్చిమ తీరాన్ని తాకే స‌మ‌యంలో స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారింది.  పెద్ద ఎత్తున అల‌లు విరుచుకుప‌డ్డాయి.  ఇక ముంబై మ‌హాన‌గ‌రాన్ని ఈ టౌటే తుఫాన్ వ‌ణికించింది.  పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీయ‌డంతో పాటుగా భారీ వ‌ర్షం కురిసింది.  టౌటే తుఫాన్ గుజ‌రాత్ తీరాన్ని దాట‌డానికి రెండు గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. ముంబై స‌ముద్ర‌తీరంలో లంగ‌రు వేసిన పెద్ద ప‌డ‌వ‌లు అల‌ల తాకిడికి లంగ‌రులు తెగిపోయి స‌ముద్రంలో కొట్టుకుపోయాయి.  అయితే, కోస్ట్ గార్డ్ సిబ్బంది 146 మందిని ర‌క్షించారు.