NTV Telugu Site icon

టౌటే ఎఫెక్ట్: వణికిపోయిన అహ్మదాబాద్… 

టౌటే తుఫాన్ ఈనెల 18 వ తేదీన గుజరాత్ తీరాన్ని దాటింది.  తరాన్ని దాటే సమయంలో భారీ విధ్వంసం సృష్టించింది.  బలమైన ఈదురు గాలులు వీచాయి.  గంటకు 150 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.  అహ్మదాబాద్ నగరంపై టౌటే తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది.  ఈ తుఫాన్ ధాటికి నగరం అల్లకల్లోలం అయింది.  బలమైన గాలులతో కూడిన వర్షం కురవడంతో అహ్మదాబాద్ నగరంలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి.  లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.  నగరంలోనే 189  చెట్లు నేలమట్టం కాగా, 43 ప్రదేశాలు ముంపుకు గురయ్యాయి.  నగరంలో పెద్ద పెద్ద చెట్లు విరిగిపడటంతో అనేక వాహనాలు దెబ్బతిన్నాయి.