తాలిబన్ల అరాచక పాలన మొదలైంది. చెప్పేది ఒకటి… చేస్తున్నది మరోకటిలా మారిపోయింది. అయితే, గత తాలిబన్ల పాలన కంటే కాస్త బెటర్‌గానే పాలన అందిస్తున్నట్టు సమాచారం. మహిళలు విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు అవకాశం ఇచ్చారు. అయితే, కంబైయిండ్ స్టడీకి మాత్రం అవకాశం ఇవ్వలేదు. స్త్రీ, పురుషులకు వేరువేరుగానే తరగతులు జరపాలని నిర్ణయించాయి. చదువులు కూడా షరియా ఇస్లామిక్ చట్టాల ప్రకారమే జరగాలని తాలిబన్లు చెబుతున్నారు. ఇకపోతే, అందరినీ గౌవరవిస్తామని చెబుతూనే తాలిబన్లు అరాచకాలు సృష్టిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రిలీజియస్ స్కాలర్స్ మాజీ అధిపతి, ప్రముఖ మత గురువు మౌల్వీ మొహమ్మద్ సర్దార్ జాద్రాన్‌ను తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారు. మౌల్వీకి గంతలు కట్టిన ఫొటోను తాలిబన్లు విడుదల చేశారు. ఇక ఇటీవలే, ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన జానపద గాయకుడిని, ప్రముఖ కమెడియన్‌ను తాలిబన్లు హత్య చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఆఫ్ఘన్ మహిళా గవర్నర్ సలీమా మజారీని తాలిబన్లు అపహరించుకుపోయిన సంగతి తెలిసిందే. ఆమెను అదుపులోకి తీసుకున్నాక ఏం చేశారు అనే సమాచారం ఇప్పటి వరకు బయటకు రాలేదు.
Read: మళ్లీ మొదలైన ఆంక్షలు… క్వారంటైన్… ఆ రాష్ట్రం నుంచి వస్తే…