NTV Telugu Site icon

కేఎల్ రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్

న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ తొడ కండరాల గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. తొలి టెస్టుకు విరాట్ కోహ్లీ దూరంగా ఉండనుండగా.. టెస్టు సిరీస్‌కు రోహిత్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బ అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ టెస్టు జరగనుండటంతో టీమిండియాకు ఇది కీలకమైన మ్యాచ్. నవంబర్ 25 నుంచి కాన్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు జరగనుంది.

తొలి టెస్టుకు టీమిండియా జట్టు: రహానె (కెప్టెన్), పుజారా (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్‌ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణ