Site icon NTV Telugu

తాజా ప‌రిశోధ‌న‌: 1.40 ల‌క్ష‌ల మంది ప్రాణాలు కాపాడిన వ్యాక్సిన్‌…

క‌రోనా మ‌హ‌మ్మారికి ప్ర‌పంచ వ్యాప్తంగా 49 ల‌క్ష‌ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.  శాస్త్ర‌వేత్త‌ల నిరంత‌ర శ్ర‌మ కార‌ణంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింది.  మ‌హ‌మ్మారుల‌కు వ్యాక్స‌న్‌ను త‌యారు చేయాలి అంటే క‌నీసం ఐదారేళ్ల స‌మ‌యం ప‌డుతుంది.  కానీ, క‌రోనా నుంచి కోలుకోవాలి అంటే వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రి కావ‌డంతో ప్ర‌పంచం మొత్తం వ్యాక్సిన్‌పైనే దృష్టి సారించింది.  ఆరునెల‌ల కాలంలోనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.  ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం వేగంగా జ‌రుగుతున్న‌ది.  వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత దాదాపుగా 1.40 ల‌క్ష‌ల మంది ప్రాణాలు కాపాడిన‌ట్టు ఇండియానా విశ్వ‌విద్యాల‌యం ప‌రిశోధ‌న‌లో తేలింది.  వ్యాక్సిన్ తీసుకున్న వారిలో క‌రోనా సోకొన‌ప్ప‌టికీ ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకోలేద‌ని, కొద్దిపాటి ఇన్ఫెక్ష‌న్‌తో బ‌య‌ట‌ప‌డ్డార‌ని, ఒక‌డోసు వ్యాక్సిన్ తీసుకున్న‌వారిలో కంటే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న‌వారు త్వ‌ర‌గా కోలుకున్నార‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది.  అమెరికాలో 2021 మే 9 నాటికి 5,78,682 మంది ప్రాణాలు కోల్పోయారు.  ఒక‌వేళ క‌రోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాక‌పోయి ఉంటే 7 ల‌క్ష‌ల మందికి పైగా ప్రాణాలు కోల్పోయేవారని పరిశోధ‌న‌లో తేలింది.  క‌రోనా వ్యాక్సిన్ వ‌ల‌న 1.40 ల‌క్ష‌ల మంది ప్రాణాలు కాపాడ‌గ‌లిగిన‌ట్టు ప‌రిశోధ‌న‌ల‌లో తేలింది.  

Read: లైవ్‌: శ్రీ గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించిన సీఎం జ‌గ‌న్‌

Exit mobile version