‘పెగాసెస్’ స్కామ్.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలనం సృష్టించిన పెగాసెస్ కుంభ కోణం విషయంలో రేపు తీర్పు వెలువరించనుంది సర్వోన్నత న్యాయస్థానం.. పెగాసెస్ స్పైవేర్‌ను నిబంధనలకు వ్యతిరేకంగా ఉపయోగించి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచిందా..? లేదా..? తెలుసుకోవాలనుకుంటున్నామని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. సెప్టెంబర్ 13న తీర్పు రిజర్వు చేసిన సంగతి తెలిసిందే.. ఈ కుంభకోణంపై నిపుణుల కమిటీతో సంప్రదించాల్సి ఉందని వ్యాఖ్యానించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ట్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమకోహ్లిలతో కూడిన ధర్మాసనం. సంప్రదించిన కొంతమంది నిపుణులు వ్యక్తిగత కారణాలతో కమిటీలో భాగస్వామ్యం కా లేకపోయారని, అందువల్లే తీర్పు ఆలస్యం అవుతోందని సెప్టెంబరు 23న పేర్కొంది సుప్రీం.. అయితే, ఈ కేసులో సమగ్ర అఫిడవిట్ కేంద్రం అందించని నేపథ్యంలో కేంద్రం అఫిడవిట్ లేకుండానే ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది సీజేఐ ధర్మాసనం.. ఈ నేపథ్యంలో రేపు ఎలాంటి తీర్పు వెలువడుతుందనే ఉత్కంఠ నెలకొంది.
కాగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే బయటికి వచ్చిన పెగాసెస్ గూఢచర్యం వ్యవహారం సంచలనాన్ని రేపింది. పార్లమెంటు సమావేశాలను కుదిపేసింది. విపక్షాలన్నీ పెగాసెస్‌పై చర్చ జరపాలని పట్టు బడడంతో.. ఇతర అంశాలపై చర్చ సాగకుండానే సమావేశాలు వాయిదా పడిన పరిస్థితి.. అయితే, ఇజ్రాయెల్ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసెస్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఇద్దరు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర ప్రముఖ జర్నలిస్టుల స్మార్ట్ఫోన్లపై కేంద్ర ప్రభుత్వం నిఘా వేసిందని కథనాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పౌరుల వ్యక్తిగత గోప్యతను భంగం చేసిందని, అక్రమంగా వారి వ్యక్తిగత వ్యవహారాల్లోకి జొరబడిందని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. పెగాసెస్ నిఘాపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశాయి. కానీ, ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. ఈ నిరసనలతోనే పార్లమెంటు సమావేశాల్లో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే.. మరోవైపు.. ఇప్పటికే శీతాకాల సమావేశాల షెడ్యూల్ కూడా వచ్చేసింది.. ఈ తరుణంలో వస్తున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.. మరోసారి ఈ వ్యవహారం పార్లమెంట్ సమావేశాలను కుదిపేసే అవకాశం లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు.
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!