హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్యాంక్‌బండ్ లోని హుస్సేన్ సాగర్‌లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్‌ను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. హుస్సేన్ సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి అనుమతులు మంజూరు చేసింది. జీహెచ్ఎంసీని అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ ఏడాది వరకు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసుకోవచ్చని తీర్పులో పేర్కొన్నది.
Read: చైనాలో మళ్లీ లాక్‌డౌన్: ఆ రాష్ట్రాల ప్రజలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం…