ఏపీలో మరో కంపెనీ భారీ పెట్టుబడులు.. 36వేల మందికి పైగా ఉపాధి

sun pharma company

ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా ముందడుగు వేసింది. ఫార్మాస్యూటికల్ రంగంలో అతిపెద్దదైన సన్‌ఫార్మా ఏపీలో తయారీ ప్లాంట్ నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ కంపెనీ ఛైర్మన్ దిలీప్ షాంఘ్వి మంగళవారం నాడు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. సన్‌ ఫార్మా తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై సీఎం జగన్‌తో ఎండీ దిలీప్ విస్తృతంగా చర్చలు జరిపారు.

Read Also: హిందూపురంలో బాలయ్య ఇంటి వద్ద ‘డంపింగ్’ వార్

ఈ సందర్భంగా ఏపీలో పారిశ్రామిక ప్రగతి కోసం తీసుకుంటున్న చర్యలను సన్ ఫార్మా కంపెనీ బృందానికి సీఎం జగన్ వివరించారు. ఈ అవకాశాలను వినియోగించుకుని పెట్టుబడులు పెట్టాలని కోరారు. అటు రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ ఎండ్ టూ ఎండ్ తయారీ ప్లాంట్ నెలకొల్పుతామని సన్‌ఫార్మా కంపెనీ ఛైర్మన్ దిలీప్ షాంఘ్వి ప్రకటించారు. ఎగుమతులే లక్ష్యంగా తమ ఉత్పత్తులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కంపెనీ ఏర్పాటుతో 36 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు దక్కుతాయని అధికారులు తెలిపారు.