నో కోవిడ్ రూల్స్.. మాస్క్ లేదు, భౌతికదూరం మాటేలేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఇక మహమ్మారి పని అయిపోయిందని భావించి అంతా కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేశారు.. నో మాస్క్, నో సోషల్ డిస్టెన్స్ అనే తరహాలో ప్రవర్తించారు ప్రజలు.. దీంతో.. సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టించింది.. మళ్లీ కేసులు తగ్గుముఖం పడుతునున్నాయి.. పండుగల సీజన్ ప్రారంభమైంది.. మళ్లీ గుంపులుగా చేరుతున్నారు.. అంతా కలుసుకుంటున్నారు. ఇదే సమయంలో.. కోవిడ్ రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నారని ఓ సర్వే చెబుతోంది.. కేంద్ర ప్రభుత్వం సైతం కొవిడ్ నిబంధనల విషయంలో రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూనే ఉంది.. అయితే, ప్రజలు మాత్రం కరోనా పోయిందన్న ఆలోచనలో జాగ్రత్తలను పట్టించుకోవడం లేదని ఓ అధ్యయనంలో తేలింది. మాస్క్‌లు ధరించకపోవడంతో పాటు, భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నట్లు తేల్చింది.. ప్రయాణాలు, బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు మాస్క్‌లు ధరిస్తున్నవారు కేవలం 13 శాతమేనని, భౌతిక దూరం పాటిస్తున్నది మరీ 6 శాతమేనని తమ తాజా సర్వేలో తేలినట్లు కమ్యూనిటీ ఆధారిత ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ తన అధ్యయనంలో పేర్కొంది.
భారత్ వ్యాప్తంగా సర్వే చేసింది ఆ సంస్థ.. దేశంలోని 366 జిల్లాల్లో 65 వేల మంది నుంచి వివరాలు సేకరించింది. జూన్‌లో చేసిన అధ్యయనం మేరకు.. 29 శాతం మంది మాస్క్‌లు ధరిస్తుండగా, 11 శాతం మంది భౌతిక దూరం పాటిస్తున్నారు. నాటి సర్వే వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖనే మీడియాకు వెల్లడించడం గమనార్హం. అయితే, కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తూ వచ్చిన సమయంలోనే ప్రజల్లో చైతన్యం ఇలా ఉంటే.. మరి ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి? అనేది ఆందోళనకు గురిచేస్తోంది.. మరోవైపు.. పండుగ సీజన్ ప్రారంభం కావడం.. పెళ్లిళ్ల సీజన్ రానుండడంతో.. మరో మూడు నెలల పాటు అంతా అప్రమత్తంగా ఉండాలని.. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు ఎయిమ్స్ లాంటి సంస్థలు హెచ్చరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!