NTV Telugu Site icon

Stray dog: వీధి కుక్క నోటిలో నవజాత శిశువు.. విచారణ కోసం ప్రత్యేక బృందాలు

Stray Dog

Stray Dog

వీధి కుక్కల దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వీధి కుక్కల దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కుక్కల దాడిలో చిన్నారులు మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే, కర్ణాటకలో దారుణ ఘటన జరిగింది. మార్చి 31న కుక్క తన నోటిలో బిడ్డను మోస్తూ కనిపించింది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని మెక్‌గన్ ఆసుపత్రి ప్రాంగణంలో వీధికుక్క నోటిలో పసికందును మోసుకెళ్లిన కేసును దర్యాప్తు చేయడానికి కర్ణాటక పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. కేసు నమోదు చేసుకున్న శివమొగ్గలోని దొడ్డపేట పోలీసులు నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ఈ మధ్య కాలంలో జరిగిన శిశువుల ప్రసవాల వివరాలను రాబడుతున్నారు.

Also Read:Prisoner Escape: సబ్‌ జైలు నుంచి ఖైదీ పరారీ.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. మార్చి 31న కుక్క నోటిలో పసికందును మోస్తూ కనిపించింది. ఈ విషయమై ఓ మహిళా సెక్యూరిటీ గార్డు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 31న ఉదయం 6 గంటలకు ఆసుపత్రిలో విధులకు హాజరుకాగా, పాపను కుక్క మోసుకెళ్తున్నట్లు ప్రజలు తమకు సమాచారం అందించారని గార్డు పోలీసులకు చెప్పాడు. ప్రసూతి వార్డు నుంచి బయటకు వస్తున్న కుక్క కూడా కనిపించింది. గార్డు ఆవరణలో వెతకగా కుక్క నోటిలో బిడ్డను పట్టుకుని కనిపించింది. పాప శవమై కనిపించింది. పసికందును వీధికుక్క చంపిందా అనే విషయంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్‌మార్టంలో ప్రీమెచ్యూర్ డెలివరీ అని తేలింది. మెక్‌గన్ ఆసుపత్రిలో శిశువు ప్రసవం జరగలేదని అధికారులు పోలీసులకు చెప్పారు. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఆస్పత్రిని కోరారు. పోలీసులు శరీర భాగాల నమూనాలను డీఎన్‌ఏ పరీక్షకు పంపుతున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

Show comments