తిరుపతిలో నిన్న కొద్దిగా శాంతించిన వరణుడు ఈరోజు తిరిగి ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి తిరుమల, తిరుపతిలో భారీగా వర్షం కురుస్తోంది. ఈ వర్షాల ధాటికి మళ్లి చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే తిరుపతి నగరంలో ఎటు చూసినా నీరు తప్పించి మరేమి కనిపించడంలేదు.
Read: ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత…
అటు తిరుమలకు వెళ్లే మెట్ల మార్గం, రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయి. శ్రీవారి మెట్టు మార్గం భారీగా దెబ్బతిన్నది. 1200 మెట్టు వద్ద బ్రిడ్జి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇప్పటీకీ ఈ మార్గంలో వరద ప్రవాహం కొనసాగుతూనే ఉన్నది. వర్షాలు భారీగా కురుస్తుండటంతో ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలను అనుమతించడంలేదు టీటీడీ. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో ద్విచక్రవాహనాలకు అనుమతులను టీటీడీ రద్దు చేసింది. దర్శనం టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు.