ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం ప‌ట్టివేత‌…

ఢిల్లీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో భారీగా బంగారాన్ని ప‌ట్టుకున్నారు క‌స్ట‌మ్స్ అధికారులు.  సుమారు 86 కేజీల బంగారాన్ని సీజ్ చేసిన‌ట్టు అధికారులు చెబుతున్నారు.  సీజ్ చేసిన బంగారం విలువ రూ.42 కోట్ల వ‌ర‌కు ఉంటుంది.  హాంకాంగ్ నుంచి ఎయిర్ కార్గో ద్వారా ఢిల్లీకి వ‌చ్చిన పార్శిల్‌లో బంగారం ఉన్న‌ట్టుగా డిఆర్ఐ అధికారులు గుర్తించారు.  క‌స్ట‌మ్స్ అధికారుల నుంచి బురుడి కొట్టించ‌డానికి బంగారాన్ని వివిధ ప‌ద్ద‌తుల ద్వారా ర‌వాణా చేసేందుకు స్మ‌గ్ల‌ర్లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  

Read: పంబాన‌దికి భారీ వ‌ర‌ద‌: శ‌బ‌రిమ‌ల‌లో భ‌క్తులకు ద‌ర్శనాలు నిలిపివేత‌…

బంగారాన్ని క‌రిగించి ట్రాన్స్‌ఫార్మ‌ర్ ఎల‌క్ట్రోప్లేటింగ్ మెషిన్‌లో దాచి, పైన నికెల్‌తో పూత‌పూసి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశారు.  అయితే, కార్గో ఎయిర్‌లో అత్యాధునిక స్కానింగ్‌తో డిఆర్ఐ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు.  ఈ స్కానింగ్‌లో బంగారం గుట్టు బ‌య‌ట‌ప‌డింది.  అక్ర‌మ బంగారం స‌ర‌ఫ‌రా కేసును న‌మోదు చేసిన అధికారులు న‌లుగురిని అదుపులోకి తీసుకున్నారు.  ఇందులో ఇద్ద‌రు ద‌క్షిణ కొరియా దేశ‌స్థులు కాగా, మ‌రో ఇద్ద‌రిని చైనా, తైవాన్ దేశ‌స్థులుగా గుర్తించారు.

Related Articles

Latest Articles