శ్రీశైలానికి భారీ వరద.. 10 గేట్లు ఎత్తివేత..

Srisailam Dam

Srisailam Dam

శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతూనే ఉంది.. ఇన్‌ఫ్లో రూపంలో 4,60,154 క్యూసెక్కుల నీరు వచ్చి జలాశయంలో చేరుతుండగా… 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. మొత్తంగా 3.40 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్‌ నుంచి దిగువకు వెళ్తోంది… ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం డ్యామ్‌లో 212.4385 టీఎంసీల నీరు ఉంది.. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక, శ్రీశైలం డ్యామ్‌ నుంచి నాగార్జునసాగర్‌ వైపు పరుగులు పెడుతోంది కృష్ణమ్మ. మరోవైపు.. శ్రీశైలం డ్యామ్‌ గేట్లు తెరిచినప్పుడు అక్కడి దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.. దీంతో.. పర్యాటకులు శ్రీశైలానికి క్యూ కడుతున్నారు.