ఏపీలోని గ్రామీణ ప్రాంతాలలో టిక్కెట్ రేట్లు చాలా తక్కువగా ఉండటంతో తమకు నష్టాలు వస్తాయని భావిస్తూ యజమానులు పలు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. ఈ జాబితాలో సౌతి ఇండియాలోనే అతిపెద్ద స్క్రీన్ కూడా చేరింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ‘వి ఎపిక్’ థియేటర్‌ను మూసివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ థియేటర్‌లో 100 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తు గల అతి పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఇది సౌతిండియాలోనే అతి పెద్ద భారీ స్క్రీన్. అటు ప్రపంచంలో చూసుకుంటే మూడో భారీ స్క్రీన్ ఇది. ఈ థియేటర్‌లో 650 సీట్లు ఉంటాయి.
Read Also: తెలంగాణాలో టికెట్ రేట్లపై కొత్త జీవో… కేసీఆర్ కు చిరు థ్యాంక్స్
ఈ థియేటర్‌ను ప్రభాస్ ‘సాహో’ సినిమాతో ప్రారంభించారు. అప్పట్లో దీనిని హీరో రామ్‌చరణ్ చేతుల మీదుగా నిర్వాహకులు ప్రారంభించడం జరిగింది. కోట్ల రూపాయలతో ఈ థియేటర్ నిర్మించారు. అయితే ఈ థియేటర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండటం మైనస్‌గా మారింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీ పరిధిలో టిక్కెట్ రేట్లు రూ.15, రూ.10, రూ.5 ఉండటంతో తమకు ఈ రేట్లు గిట్టవని నిర్వాహకులు థియేటర్‌ను తాత్కాలికంగా మూసివేశారు. కాగా టిక్కెట్ల రేట్ల ఇష్యూతో ఇప్పటికే ఏపీలో సుమారు 100 థియేటర్ల వరకు మూతపడినట్లు తెలుస్తోంది.