Site icon NTV Telugu

Smuggled Gold: ముంబై విమానాశ్రయంలో గోల్డ్ స్మగ్లింగ్.. బంగారం విలువ ఎంతంటే

Gold

Gold

ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బంగారం స్మగ్లింగ్ రాకెట్‌ను ఛేదించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10.16 కోట్ల రూపాయల విలువైన 16.36 కిలోల బంగారాన్ని పేస్ట్ రూపంలో స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో 18 మంది సూడాన్ మహిళలతో పాటు ఒక భారతీయ మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల సోదాల్లో సుమారు రూ.85 లక్షల విలువైన 1.42 కిలోల బంగారంతో పాటు రూ. 16 లక్షల విలువైన విదేశీ కరెన్సీ, రూ. 88 లక్షల భారతీయ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
Also Read:Vikram : కమల్ ఆఫర్‎ను తిరస్కరించిన విక్రమ్.. ఎందుకంటే ?

సోమవారం యూఏఈ నుంచి ముంబైకి వెళ్లే ప్రయాణికుల సిండికేట్‌ ద్వారా పేస్ట్ రూపంలో బంగారాన్ని భారత్‌లోకి స్మగ్లింగ్ చేయబోతున్నారనే నిర్దిష్ట నిఘా ఆధారంగా డీఆర్‌ఐ అధికారులు సిటీ ఎయిర్‌పోర్టులో నిఘా పెట్టారు. మూడు విమానాల్లో ప్రయాణిస్తున్న సిండికేట్‌లో భాగమని అనుమానిస్తున్న ప్రయాణికులను విమానాశ్రయంలో డిఆర్‌ఐ బృందం గుర్తించి అడ్డగించింది. డీఆర్‌ఐ తమ సోదాల్లో 16.36 కిలోల బంగారాన్ని పేస్ట్ రూపంలో, బంగారు ముక్కలు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ రూ. 10.16 కోట్లు అని అధికారి తెలిపారు. స్మగ్లింగ్ బంగారాన్ని తీసుకెళ్తున్న సూడాన్‌కు చెందిన 18 మంది మహిళలు, ప్రయాణికుల కదలికలను సమన్వయం చేస్తున్న భారతీయ మహిళను అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారంలో ఎక్కువ భాగం అనుమానాస్పద ప్రయాణీకుల శరీరంపై దాచబడిందన్నారు. విలువైన లోహాన్ని గుర్తించడం చాలా కష్టంగా మారిందని చెప్పారు. ప్రస్తుతం నిందితుల విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు.
Also Read:Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం..

Exit mobile version