NTV Telugu Site icon

వీళ్లు మాములోళ్లు కాదు… చిన్న చెంచాతో పెద్ద సొరంగ‌మే తవ్వేశారు…

ఏ ప‌ని పూర్తి చేయ‌డానికైనా పక్కాగా స్కెచ్ ఉండాలి.  దానికి త‌గిన ప‌ట్టుద‌ల‌, ఓర్పు, స‌హ‌నం ఉండాలి.  అంత‌కు మించి వారితో క‌లిసి ప‌నిచేసే వ్యక్తులు ఉండాలి.  అన్ని అనుకున్న‌ట్టుగా కుదిరితే ఎలాంటి క‌ష్ట‌మైన ప‌నినైనా పూర్తిచేయ‌వ‌చ్చు అని నిరూపించారు ఇజ్రాయిల్‌కు చెందిన ఖైదీలు.  ఇజ్రాయిల్‌లోని గిల్బోవా అనే జైలు ఉన్న‌ది.  అందులో క‌ర‌డుగ‌ట్టిన నేర‌స్తుల‌ను ఉంచుతారు.  నిత్యం క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఉంటుంది.  అయిన‌ప్ప‌టికీ ఆరుగురు ఖైదీలో అధికారుల క‌ళ్లుగ‌ప్పి తప్పించుకుపోయారు.  వారు త‌ప్పించుకోవ‌డానికి ఉప‌యోగించిన ఆయుధం తుప్పుప‌ట్టిన చిన్న చెంచా.  అవును.  చిన్న చెంచానే.  తుప్పుప‌ట్టిన చిన్న చెంచాతో గ‌దిలోని టాయిలెట్ నుంచి జైలు బ‌య‌ట వ‌ర‌కు సోరంగం త‌వ్వారు.  ఎన్నో ఏళ్లుగా క‌ష్ట‌ప‌డితేనే అంత‌పెద్ద సొరంగం పూర్త‌వుతుంది.  సొరంగం పూర్త‌యిన త‌రువాత ఆరుగురు ఖైదీలు అక్క‌డి నుంచి త‌ప్పించుకొని పారిపోయారు.  ఇందులో ఐదురుగు ఇస్లామిక్ జిహాదీకి చెందిన తీవ్ర‌వాదులు కాగా ఒక‌రు అల్ అక్సా మార్టిర్స్ బ్రిగేడ్ నాయ‌కుడు.  అత్యంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త నుంచి చిన్న సొరంగం చేసుకొని పార‌పోవ‌డంపై ఇజ్రాయిల్ ప్ర‌ధాని న‌ఫ్తాలీ బెనెట్ సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. పాల‌స్తీనా వైపు వెళ్లి ఉంటారని, త్వ‌ర‌లోనే వాళ్ల‌ను ప‌ట్టుకుంటామ‌ని అధికారులు చెబుతున్నారు.  

Read: ఈ బెండ‌కాయ‌ల ఖ‌రీదు రూ.800 ఎందుకో తెలుసా…!!