ఈ బెండ‌కాయ‌ల ఖ‌రీదు రూ.800 ఎందుకో తెలుసా…!!

మామూలుగా అయితే బెండ‌కాయలు కిలో రూ.30 లేదా రూ.40 వ‌ర‌కు ఉంటాయి.  కానీ, ఆ బెండ‌కాయ‌లు మాత్రం మ‌ట‌న్ ధ‌ర పలుకుతున్నాయి.  అందులో స్పెష‌ల్ ఏముంది అంటే అంతా స్పెష‌లే అంటున్నారు.  ఎందుకంటే, ఈ బెండ‌కాయలు ఆకుప‌చ్చ రంగులో కాకుండా ఎరుపు రంగులో ఉంటాయి. సాధార‌ణ బెండ‌కాయ‌ల‌తో పోల్చితే ఇందులో ఉండే పోష‌కాలు అమోఘం.  గుండెజ‌బ్బులు, ర‌క్త‌పోటు, మ‌ధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుతుంది.  40 రోజుల్లోనే ఈ పంట చేతికి వ‌చ్చిన‌ట్టు మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు చెందిన రైతు రాజ్‌పుత్ తెలిపారు.  లాభసాటిగా ఉండ‌టంతో పాటుగా ఆరోగ్య‌ప‌ర‌మైన పోష‌కాలు ఉండ‌టంతో వీటిని కొనుగోలు చేసేందుకు వినియోగ‌దారులు పోటీ ప‌డుతున్నార‌ని డిమాండ్ ఉండ‌టంతో ధ‌ర‌లు అధికంగా ఉన్న‌ట్టు రైతు రాజ్‌పుత్ తెలిపారు. 

Read: మ‌రో 12 ఏళ్ల‌లో ఆ టైటానిక్ క‌నిపించ‌దు… ఎందుకంటే…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-