NTV Telugu Site icon

Women Reservations Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు సహకరిస్తాం: సీతారాం ఏచూరి

Sitrma Yechuri 1

Sitrma Yechuri 1

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్షకు సీపీఎం మద్దతు ప్రకటించింది. ఈ ధర్నాలో పాల్గొన్న సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. చట్టసభల్లో మహిళలకు సరైన భాగస్వామ్యం లేనంత వరకు మన సమాజం ముందుకు వెళ్లదని చెప్పారు. రిజర్వేషన్ల సాధన కోసం కవిత అడుగు వేశారని ప్రశంసించారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న తర్వాత మహిళా రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందిందని ఆయన గుర్తు చేశారు. కానీ ఇంత వరకు లోక్ సభలో ఆమోదం పొందలేకపోయిందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు గతంలో మోదీ కూడా మద్దతు తెలిపారని గుర్తు చేశారు. అయినప్పటికీ ఆయన ప్రధాని అయి తొమ్మిదేళ్లు పూర్తవుతున్నా బిల్లును లోక్ సభలో పెట్టలేదని విమర్శించారు.ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనైనా మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని ఏచూరి కోరారు. మహిళా రిజర్వేషన్ కోసం చేసే పోరాటంలో తాము పాల్గొంటామని ఏచూరి స్పష్టం చేశారు.

Aslo Read : Sumalatha: ప్రధాని మోదీకే నా ఫుల్ సపోర్ట్.. బీజేపీకి సినీనటి, ఎంపీ సుమలత మద్దతు

కాగా, మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేపట్టారు. మహిళా రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటబాట విడిచేది లేదని కవిత స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు 27ఏళ్లుగా పెండింగ్‌లో ఉందన్న ఆమె… 1996లో దేవెగౌడ హయాంలో బిల్లు పెట్టినా ఇంకా చట్టం కాలేదని తెలిపారు. కేంద్రంలో పూర్తి మద్దతు ఉన్న బీజేపీ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే అన్ని పక్షాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తామని కవిత ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు వచ్చే వరకూ తమ పోరాటాన్ని విడిచే ప్రసక్తే లేదని కవిత స్పష్టం చేశారు.

Show comments