కాన్పూర్ లో రేపు ప్రారంభం కానున్న మొదటి మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ ఆడుతున్నట్లు కెప్టెన్ అజింక్య రహానే ప్రకటించాడు. అయితే అయ్యర్ కు ఇదే టెస్ట్ అరంగేట్రం అవుతుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో చాలా మంది ఆటగాళ్లకు విధరంతిని ఇచ్చారు. రేపటి టెస్ట్ లో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ లు ఆడకపోవడంతో శ్రేయాస్ అయ్యర్ కు అవకాశం వచ్చింది అని తెలుస్తుంది. అలాగే ఈ కేఎల్ రాహుల్‌కు గాయం కావడంతో శుభ్‌మాన్ గిల్ ఈ మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ తో కలిసి ఓపెనర్ గా రానున్నట్లు తెలుస్తుంది. ఇక ముంబై తరఫున దేశీయ క్రికెట్ లో ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్ కు అద్భుతమైన ఫస్ట్ క్లాస్ రికార్డు ఉంది. అయ్యర్ 54 మ్యాచ్‌లలో 52.18 సగటుతో 4592 పరుగులు. అందులో అయ్యర్ 12 సెంచరీలు ఉన్నాయి. అయితే ఫస్ట్ క్లాస్ లో అయ్యర్ అత్యుత్తమ స్కోరు 202 నాటౌట్.
శ్రేయాస్ ఆడుతున్నట్లు క్లారిటీ ఇచ్చిన రహానే…!
