Site icon NTV Telugu

Shaktikanta Das: ఆర్బీఐ గవర్నర్‌ కు అరుదైన గౌరవం

Das11

Das11

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్‌కు ఆరుదైన గౌరవం దక్కింది. 2023 సంవత్సరానికి గాను ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని అందకున్నారు. ప్రముఖ ఇంటర్నేషనల్‌ రీసెర్చి జర్నల్‌ సెంట్రల్‌ బ్యాంకింగ్‌ శక్తికాంత దాస్‌కు ఈ పురస్కారన్ని ప్రదానం చేసింది. కష్టకాలంలో ఆర్‌బీఐ గవర్నర్‌గా ఆయన అందించిన సేవలకు గానూ ఈ పురస్కారం ప్రకటించినట్లు సెంట్రల్‌ బ్యాంకింగ్‌ తెలిపింది.

Also Read:Black Adam: ఒటీటీలో చూసిన తర్వాత అయిన ఈ క్యారెక్టర్ ని కంటిన్యూ చేస్తారా?

కరోనా సమయం, ఉక్రెయిన్‌- రష్యా యుద్దం కారణంగా నెలకొన్న ద్రవ్యల్బణం ఒత్తిళ్లను అధిగమించేందుకు ఆర్బీఐ గవర్నర్ గా సమర్థవంతంగా విధులు నిర్వహించారని కొనియాడింది. శక్తికాంత దాస్‌ నాయకత్వంలోనే కఠిన సంస్కరణలు తీసుకురావడంతో పాటు, వినూత్న పేమెంట్‌ వ్యవస్థలు భారత్‌లో పరిచయం అయ్యాయని తెలిపింది. కరోనా సమయంలో వృద్ధి కోసం ఆయన చేపట్టిన చర్యలను కొనియాడింది.ఒక వైపు తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, మరోవైపు ఆర్థిక విపత్తుల మధ్య ఆర్‌బిఐని నేర్పుగా నడిపించారని CBJ పేర్కొంది. కాగా,’గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం అందుకున్న రెండో ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ నిలిచారు. గతంలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌కు 2015లో ఈ పురస్కారం అందుకున్నారు.

Also Read:Rajasthan: గీజర్ గ్యాస్‌ లీకై ఊపిరాడక దంపతులు మృతి

Exit mobile version