NTV Telugu Site icon

కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. సీనియర్స్‌ వర్సెస్‌ రెబల్స్‌

రోజురోజుకు తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితులు మారుతున్నాయి. టీ కాంగ్రెస్‌ అగ్ర నాయకులు తీరు ఆ పార్టీ కార్యకర్తలకు పలు సంకేతాలను ఇస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్‌ను మునపటి స్థాయికి తీసుకువచ్చేందుకు సీనియర్ నాయకులు కృషి చేస్తోంటే.. మరి కొందరి తీరు ఆ పార్టీ కార్యకర్తల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా రేవంతర్‌ రెడ్డి నియామకం జరిగననాటి నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహరాల ఇంచార్జీ మానిక్కం ఠాగూర్‌పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.

100 కోట్లు తీసుకొని రేవంత్‌ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారని ఆ పార్టీకి చెందిన నేతలు విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తన ఉనికిని తెలంగాణాలో కొల్పోతుందా.. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర నుంచి తొలిగిపోతుందా అనే సందర్భంలో రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా నియామకం అయ్యారు. ఆ నాటి నుంచి రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల్లో నూతనోఉత్తేజం నింపేందుకు బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీకి తగిన మార్గదర్శి వచ్చాడని ఎంతో మంది రాజకీయవేత్తలు అన్నారు కూడా. అయితే మొన్న జరిగిన హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కనీసం డిపాజిట్‌ కూడా దక్కించుకోలేక ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీనిపై గాంధీభవన్‌లో పీఏసీ సమావేశం నిర్వహించగా పార్టీ సీనియర్‌ నాయకులు హజరయ్యారు.

కానీ ఈ సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా కొట్టారు. ఇదిలా ఉంటే.. పీఏసీ సమావేశంలో రేవంత్‌ రెడ్డి పై అక్కసు ఉన్నవాళ్లంతా తమలోపల ఉన్నదంతా కక్కేశారు. వీరి వాదనలు విన్న ఠాగూర్ సైతం వారికి తగిన తీరులో సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా పార్టీ గురించి మాట్లాడాలంటే పీఏసీలోనే మాట్లాడాలని.. కానీ.. మీడియా ముందు మాట్లాడవద్దంటూ.. జగ్గారెడ్డి వారికి హెచ్చరికలు సైతం జారీ చేశారు. పార్టీని బూత్‌ లెవల్‌ నుంచి చైతన్యం చేసి, ఐక్యమత్యంగా వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకీ ప్రత్యమ్నాయంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్‌ నేతలు సంకల్పించినట్లు కనిపిస్తోంది.

దీనికోసం రేవంత్‌ రెడ్డి నియామకం నుంచి పార్టీపై విముఖతతో రెబల్‌లా మారిన కోమటిరెడ్డిని బుజ్జగించే బాధ్యతను పార్టీ ఉద్ధండ పండితుడు వీ. హనుమంతరావుకు అప్పగించారు. ఆయన కూడా నేను చూసుకుంటా అన్నట్లే సమాధానం ఇచ్చారు. అయితే ఇటీవల మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌ సాగర్‌ తీరు కూడా తెలంగాణ కాంగ్రెస్‌ కాలికి ముల్లులా తయారైంది. ప్రేమ్‌ సాగర్‌ సంగతిపై భట్టిపై ఉంచిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు.. కిందిస్టాయి నుంచి పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్నారు.

పార్టీకి పునాదులైన డీసీసీ, మండల స్థాయి కేడర్‌ బలంగా ఉంటేనే పార్టీ బలోపేతమవుతుందని నిర్ణయాలు తీసుకుంటున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గెలుపే లక్ష్యంగా ముందుకు సాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలి మరి పార్టీ సీనియర్‌ నేతలు కార్యకర్తల్లో నెలకొన్న గందరగోళాన్ని ఎంతమేర సరిదిద్దుతారో..