Site icon NTV Telugu

Women’s World Boxing Championships: పసిడిని ముద్దాడిన సావీటీ.. ‘బంగారు’ మహిళలు

Neetu

Neetu

ప్రపంచ మహిళ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ మరో స్వర్ణం సాధించింది. 81 కేజీల విభాగం ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్ లీనాపై సావీటీ బూరా విజయం సాధించి భారత్‌కు రెండో బంగారు పతకాన్ని అందించింది. వాంగ్‌ లినాపై 4-3 తేడాతో విజయం సాధించింది. సావీటీ, చైనాకు చెందిన వాంగ్ లీనాల మధ్య హోరాహోరీగా సాగింది. అయితే భారత స్టార్ చివరికి స్వల్ప తేడాతో రెండో జట్టును ఓడించింది.
Also Read: Gwalior Hospital: 400 కోట్లతో ఆస్పత్రి నిర్మాణం.. అయినా స్ట్రెచర్లు లేవట!

అంతకుముందు జరిగిన 48 కేజీల విభాగం ఫైనల్‌లో మంగోలియాకు చెందిన లుత్‌ సాయిఖాన్ అల్టాన్‌సెట్సెగ్‌పై నీతూ గంగాస్ గోల్డ్ సాధించింది. ఏకగ్రీవంగా 5-0తో గెలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. టోర్నమెంట్ చరిత్రలో స్వర్ణం గెలిచిన ఆరో భారతీయ మహిళా నీతూ గంగాస్,, సావీటీ ఏడో స్థానంలో నిలిచింది. వాంగ్ లీనా రెండో రౌండ్‌లో కొన్ని పంచ్‌లతో భారత్‌కు చెందిన సావీటీ బూరాను నిలువరించింది. సావీటీ బూరా మొదటి రౌండ్‌లో దూకుడు అడ్డుకుంది. రౌండ్ ముగిసే సమయానికి ఆమె వాంగ్ లీనాకు ఒక పాయింట్‌తో ఆధిక్యంలో ఉంది.
Also Read:Sansad Ratna Award 2023: సంసద్ రత్న అవార్డు అందుకున్న విజయసాయిరెడ్డి, టీజీ వెంకటేష్‌..

2014లో ఫైనల్‌లో ఓడి రజతంతో సరిపెట్టుకున్న 30 ఏళ్ల స్వీటీ… ఈ సారి పట్టుదలతో పసిడిని ఒడిసి పట్టింది. అంతకుముందు సెమీస్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్‌వా నుంచి కఠిన సవాల్‌ ఎదుర్కొన్న స్వీటీ.. తాజాగా 4-3 తేడాతో విజయం సాధించింది. కాగా, భారత్‌కు చెందిన మేరీకోమ్‌, సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్‌, లేఖ కేసీ, నిఖత్‌ జరీన్‌ ఇప్పటి వరకు ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించగా.. ఇప్పుడు ఆ జాబితాలో నీతూ, స్వీటీ కూడా చేరారు.

Exit mobile version