NTV Telugu Site icon

Uddhav Thackeray: సావర్కర్ మా దేవుడు.. రాహుల్ గాంధీకి ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్

Rahul And Uddav

Rahul And Uddav

క్షమాపణలు చెప్పడానికి నేను సావర్కర్ కాదు అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యుబిటి) నాయకుడు ఉద్ధవ్ థాకరే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక్ సావర్కర్‌ను అవమానించవద్దని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని హెచ్చరించారు. సావర్కర్‌ను కించపరచడం విపక్ష కూటమిలో పగుళ్లు సృష్టిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌ను తాను తన ఆరాధ్యదైవంగా భావిస్తున్నానని, ఆయనను అవమానించడం మానుకోవాలని ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ నాయకుడిని కోరారు.
Also Read: Harrassed : బండిపై వెళ్తున్న యువతిని కొట్టిన యువకులు.. మద్యంమత్తులో వీరంగం..

శివసేన (యుబిటి), కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అనే మూడు పార్టీల మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఏర్పడిందని, దాని కోసం ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉత్తర మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ముస్లింలు అధికంగా ఉండే టెక్స్‌టైల్ పట్టణం మాలెగావ్‌లో జరిగిన ర్యాలీలో ఠాక్రే మాట్లాడుతూ రాహుల్ గాంధీని రెచ్చగొట్టేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. సావర్కర్ మన ఆరాధ్యదైవం, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనం కలిసి పోరాడవలసి వస్తే ఆయన అవమానాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. 14 ఏళ్ల పాటు అండమాన్ సెల్యులార్ జైల్లో సావర్కర్ ఊహించలేని హింసను అనుభవించారని గుర్తు చేశారు.
Also Read: Women’s Premier League: ఢిల్లీ క్యాపిటల్స్​పై ముంబై ఇండియన్స్ ఘన విజయం

మన దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు మనం కలిసి వచ్చామని రాహుల్ గాంధీకి చెప్పాలనుకుంటున్నాను. కానీ మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారు. ఈ సమయాన్ని వృధా చేసుకునేందుకు మనం అనుమతిస్తే, ప్రజాస్వామ్యం ఉనికిలో ఉండదు. 2024 చివరి ఎన్నికలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా, 2019 పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్‌లోని కోర్టు గాంధీని దోషిగా నిర్ధారించిన మరుసటి రోజు, శుక్రవారం లోక్‌సభకు గాంధీ అనర్హుడయ్యాడు. తన అనర్హతపై ఢిల్లీలో శనివారం విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “నా పేరు సావర్కర్ కాదు, నా పేరు గాంధీ, గాంధీ ఎవరికీ క్షమాపణ చెప్పలేదు” అని అన్నారు. తన భారత్ జోడో యాత్రకు తాను గాంధీకి మద్దతు ఇచ్చానని థాకరే గుర్తు చేశారు. “రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో బాగా మాట్లాడారు. 20,000 కోట్లు ఎవరికి చెందుతాయని సరైన ప్రశ్నలను లేవనెత్తారు. కానీ ప్రభుత్వం సమాధానం చెప్పదలుచుకోవడం లేదు’’ అని థాకరే అన్నారు.