Site icon NTV Telugu

సౌదీ అరేబియా కీలక నిర్ణయం.. వారిపై నిషేధం..

ఇస్లామిక్‌ దేశమైన సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. తబ్లిగీ జమాత్‌ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ వారిపై నిషేధం విధిస్తున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. ఇస్లామిక్‌ మతాన్ని కాపాడటమే ధ్యేయమంటూ వ్యాఖ్యలు చేసే ఈ సంస్థపై సౌదీ అరేబియా నిషేధం విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే 1926లో తబ్లిగీ జమాత్‌ సంస్థ ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో సుమారు 35 కోట్ల ముస్లింలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ముస్లింలకు చెందిన సంస్థను ఇతర దేశాల్లో నిషేధం విధిస్తే గందరగోళం సృష్టించేవారు… కానీ ఇప్పుడు ఏకంగా ఓ ఇస్లామిక్‌ దేశమే వీరిపై నిషేధం విధించడంతో ఎవ్వరూ నోరు మెదపడం లేదు. అంతేకాకుండా భారత్‌ కూడా దీనిపై తబ్లిగీ జమాత్‌ సంస్థపై దృష్టి సారించాలని సౌదీ అరేబియా అనడం కొసమెరుపు

Exit mobile version