ఏపీ, తెలంగాణ సీఎంలు ఇద్దరూ ఒకటే అని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.ఏపీ, తెలంగాణ నాయకుల మధ్య విచిత్రమైన చర్చ నడుస్తోందన్నారు. రాష్ట్రం విడిపోక ముందు ఒకలా, రాష్ట్రం విడిపోయిన తర్వాత మరోలా చర్చ జరుగుతోంది. అనేక అంశాలతో తెలంగాణ ఉద్యమం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఉండేవి. రాష్ట్ర విభజనకు సంబంధించి మేధావులు, కవులు, కళాకారుల డిమాండ్లు వినిపించారు. కేసీఆర్ కూడా ఉద్యమానికి కలిసి వచ్చారు. ఈమధ్యలో కొత్త చర్చ జరుగుతోంది. సమైక్యంగా ఉంటే బాగుండు అనే కోణంలో మాట్లాడుతున్నారు.
ఇప్పుడు ఎవరూ సంతృప్తిగా లేరు. ఉద్యోగులు, విద్యార్థుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన మూడేళ్ళకే రాష్ట్రం కలిసి ఉండాలని చర్చ వచ్చింది. షర్మిల తెలంగాణ కోడలు అనే పేరుతో స్పేస్ తీసుకునే ప్రయత్నం చేస్తోందన్నారు జగ్గారెడ్డి. టీడీపీ నుంచి కూడా తెలంగాణ కొడుకును అని ఎవరైనా రావొచ్చు. జగన్ పిల్లలు కూడా తెలంగాణనే అని చెప్పొచ్చు. దీంతో కొంత గందరగోళం ఏర్పడింది. లోకేష్ కూడా తెలంగాణలో పుట్టానని చెబుతున్నారు. రాయచూరు, మహారాష్ట్ర, ఏపి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో తమను కలపండి అనే డిమాండ్లు చూస్తున్నామన్నారు.
బీజేపీ నేతలు గోడ మీద కూర్చుంటారు. కలవమంటే కలుపుతారు. విడగొట్టమంటే విడగడతారు. కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని మాత్రం మార్చుకోదు. నేను మూడు ప్రాంతాలు కలిసి ఉండాలని చెప్పాను. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన తరువాత కూడా నా వాయిస్ వినిపించా. గతంలో నేను చెప్పిన విషయాన్నే ఇప్పుడంతా అంటున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పీసీసీ హోదాలో అన్నారు. రెండు రాష్ట్రాలు కలుపుతా అంటే నా సంపూర్ణ మద్దతు ఇస్తా. కేసీఆర్ కు సహకరిస్తానన్నారు.
ఏపీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు సమర్ధనీయం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఫైనల్ కాదు. నేను వ్యక్తిగతంగా నా అభిప్రాయం చెబుతున్నా. పీసీసీ అధ్యక్షుడుగా ఉంటే నేను అంత స్వతంత్రంగా మాట్లాడే వాణ్ణి కాదు. నా వ్యక్తిగత అభిప్రాయాలను రేవంత్ రెడ్డి డామినేట్ చేసే అధికారం లేదు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడుగా తన అభిప్రాయాలను చెప్పారు. ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారు. కోదండరామ్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉన్నాయో చూశాం. ఆత్మబలిదానాల ఆశయం నెరవేరలేదన్నారు జగ్గారెడ్డి. బలిదానాలకు ఇప్పుడు విలువ లేదు. కేసీఆర్ ఏది ఉట్టిగానే మాట్లాడరు. అందులో ఏదో నిగూఢమయిన అర్థం ఉంటుంది.
తెలంగాణలో కూడా సమైక్యాంధ్ర కావాలని ఇప్పుడు కోరుకుంటున్నారు. రాష్ట్రం విడిపోయినా నాయకుల కోడళ్లు, కొడుకులు దిగుతున్నారు. ఆంధ్ర, రాయలసీమ జీన్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో కోటి మంది ఆంధ్ర, రాయలసీమ వాళ్ళు ఉన్నారు. విడిపోతే రాష్ట్రం బాగుంటుందని అందరూ కళలు కన్నారు. కానీ విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు హ్యాపీగా ఉన్నారో లేదో తెలియదు.
నా బలం, బలహీనత ఏంటో నాకు తెలుసు. ఆంధ్ర, రాయలసీమలో పరిస్థితి ఏంటో నాకు తెలుసు. కేసీఆర్ ఒక గేమ్ ఆడుతున్నారు. హైదరాబాద్ లో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. కేసీఆర్ ట్రాప్ లో నేను పడలేదు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ ను తొక్కే దమ్ము కేసీఆర్ కు లేదన్నారు చిట్ చాట్‌లో జగ్గారెడ్డి.
తెలంగాణ, సమైక్యాంధ్ర పేరుతో కొత్త నాటకాలు మొదలు పెట్టారని తీవ్రంగా విమర్శించారు. భూమ్మీద ఇది జరగాలి, జరగొద్దు అని ఏమి లేదు. అన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. టీఆర్ఎస్, వైసీపీ ఒక్కటే. జగన్, కేసీఆర్ వేరు వేరు కాదు. దీని వెనుక బీజేపీ ఉండే అవకాశం ఉంది. కేసీఆర్ నాడి నాకు బాగా తెలుసు. ఇక మీద ఎలాంటి ఉద్యమాలు రావు. చర్చల ద్వారానే ఏకం అవుతారన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.