NTV Telugu Site icon

చీటింగ్‌ కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అరెస్ట్..

చీటింగ్‌ కేసులో సంధ్య కన్వెన్షన్‌ ఎండీ శ్రీధర్‌ రావును రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. నానక్‌రాంగూడలోని సర్వే నెంబర్ 104లో శ్రీధర్ రావుకు ఐదు ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించిన అంశంలో మమ్మల్ని మోసం చేశాడంటూ రాయదుర్గం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఆ భూమి అమ్మకం జరిగినప్పుడు తమకు రావాల్సిన అమౌంట్ ఇవ్వకుండా మోసం చేశాడని, డబ్బులు అడిగితే గన్‌మెన్‌లను చూపించి బెదిరింపులకు పాల్పడ్డాడని, చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు.

కొందరికి నిర్మాణం పూర్తయిన ఫ్లాట్ లను అప్పగించ లేదు. మరికొందరితో పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా చంపుతామని బెదిరింపులకు దిగడం. భూమి అమ్మకాలు జరిపినప్పుడు ఏజెంట్లకు ఇవ్వాల్సిన కమిషన్ ఇవ్వకుండా చంపుతామని బెదిరించడం. నానక్‌రాంగూడ సర్వే నెంబర్ 104/3 లో 5 ఎకరాలు అమ్మిన విషయంలో కమీషన్ ఇవ్వలేదంటూ మహేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

రాయదుర్గం పాన్ మక్తా సర్వే నెంబర్ 83 పార్టు లో కట్టిన కమర్షియల్ బిల్డింగ్ లో ఐటీ కంపెనీ స్పేస్ కోసం 11 కోట్లు చె‌ల్లించిన బాధితులు… ఇప్పటి వరకు తమకు హ్యాండోవర్ చేయలేదని ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, బెంగళూరు లలో సెల్లార్ వర్క్ చేస్తే డబ్బులు ఇవ్వలేదని మరో వ్యక్తి ఫిర్యాదు. ఇలా గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి పోలీసు స్టేషన్ లలో ఇప్పటి వరకు ఏడుగురు బాధితులు ఫిర్యాదు చేశారు.